![Varalaxmi Sarathkumar Plays Powerful Role In Chasing Movie - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/14/30.jpg.webp?itok=aqfsASrK)
డ్రగ్స్ ముఠా అంతుచూసే పోలీస్ అధికారి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం "చేజింగ్". విదేశాల నుంచి డ్రగ్స్ చట్టవిరుద్ధంగా మన దేశానికి సరఫరా చేస్తూ కోట్లకు పడగెత్తిన మాఫియా ముఠా కన్నెపిల్లలపై మత్తు మందును ప్రయోగిస్తూ వారి మాన ప్రాణాలతో చెలగాటమాడే కామాంధుల ఆట కట్టించడానికి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది.
ఆమె ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఎలా పట్టుకుంది? అన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం చేజింగ్. ఇందులో స్పెషల్ పోలీస్ అధికారిణిగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఏషియన్ మీడియా పతాకంపై మదియళగన్ మునియాండి నిర్మించారు. కేకే కుమార్ దర్శకత్వం వహించగా, దసి సంగీతాన్ని, కృష్ణ స్వామి ఛాయాగ్రహణం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment