
అవును! పడక గదికి రమ్మంటారు : సీనియర్ నటి
నటీమణులపై లైంగిక వేధింపులపై ఇటీవల మీడియాలో కథలు కథలుగా కథనాలు ప్రచారం జరుగుగుతున్న విషయం తెలిసిందే. అడ్జెస్ట్‌మెంట్ అంటూ నటి రెజీనా, ఒక ఛానల్ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ నటి సంధ్య ఇలా ఇటీవల పలువురు నటీమణులు ఛేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటి కస్తూరి తాను అలాంటి బాధితురాలినేనని చెప్పారు. అంతే కాదు అవకాశాల పేరుతో పడక గదికి రమ్మనే అలవాటు సినిమ పరిశ్రమలో ఉందనే విషయాన్ని నొక్కి వక్కానించారు.
ఒక్కప్పుడు బిజీ నాయకిగా రాణించిన నటి కస్తూరి. ఆ తరువాత అమెరికాకు చెందిన డాక్టరును పెళ్లాడి అక్కడే సెటిల్ అయ్యారు. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి నృత్యం నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక అంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అవకాశాల పేరుతో నటీమణులను పడక గదికి రమ్మనే అలవాటు చిత్ర పరిశ్రమలో ఉందని అన్నారు. కొందరు నటీమణులు ఆలోచనా రాహిత్యంతో మాట్లాడతారు. మరికొందరు పారితోషికం డిమాండ్‌తో అవకాశాలను కోల్పోతారు. ఇంకొందరు సరైన నిర్ణయం తీసుకొవడంతో ఫెయిల్ అయ్యి నటిగా ఎదగలేకపోతారని అన్నారు. ఇక తన విషయంలో తాను ఆశించింది జరగకపోవడంతో తనను చిత్రాల నుంచి తొలగించారని చెప్పారు. అదీ ఒక హీరో కారణంగానే జరిగిందన్నారు.
ఇప్పుడా హీరో రాజకీయవాదిగా ఉన్నారని చెప్పారు. ఆయనకు ఈగో అధికం అని తాను భావిస్తానన్నారు. అయినా తానా హీరోను గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు. ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్ సమయంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని తెలిపారు. ఆ తరువాత ఆయన రెండు చిత్రాల నుంచి తనను తప్పించారని చెప్పారు అన్న కస్తూరి ఆ నటుడెవరన్నది మాత్రం చెప్పలేదు. ఈమె ఒక్క తమిళంలోనే కాకుండా పలు భాషా చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. నటి కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి మరి. అలాగే ఇలా ఇంకెందరు నటీమణులు స్పందిస్తారో కూడా వేచి చూడాల్సిందే.