
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. ఈ మూవీతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నేను పనిచేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో మహేంద్రగారు ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. రెండు మూడు రోజుల్లో ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభిస్తా’’ అన్నారు.
‘‘ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించాం. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ‘‘స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతి శబరి పాత్రలో వరలక్ష్మి నటించారు’’ అన్నారు అనిల్ కాట్జ్. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపీ సుందర్.