
‘‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి సార్ నా పని గురించి, నా నటన గురించి చాలా ΄పాజిటివ్‌గా మాట్లాడారు. ‘నీలాంటి ప్రతిభ ఉన్న నటి తెలుగు చిత్రపరిశ్రమలో ఉండాలి.. హైదరాబాద్‌లోనే ఉండు’ అని ఆయన చెప్పడంతో ఇన్నాళ్ల నా కష్టానికి ఒక అవార్డు వచ్చిందని సంతోషంగా అనిపించింది. సహ నటీనటుల గురించి అలా మాట్లాడాలంటే ఎంతో మంచి మనసుండాలి. ప్రీ రిలీజ్ వేడుక అయిన తర్వాత కృతజ్ఞతలు చెబుతూ ఆయనకు మెసేజ్ చేశాను’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ పంచుకున్న విశేషాలు.
♦‘హను–మాన్’లో తేజ సజ్జాకి అక్క (అంజమ్మ) పాత్రలో కనిపిస్తాను. ఇది సూపర్ హీరో ఫిల్మ్. ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ ఉండే ఫైట్ నాది. అంజమ్మ పాత్ర నా కెరీర్‌లో వైవిధ్యంగా ఉంటుంది.
♦ తేజ, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నా అంజమ్మ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుంది. నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే పేరు వచ్చింది.. ఆ పేరుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను.
♦ ఏ సినిమా చేసినా ‘ఇది నా తొలి చిత్రం.. నేను కొత్త’ అనే ఆలోచనతో చేస్తాను. విలన్, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ అని చూడను. నా పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఏదైనా చేస్తాను. కొంతమందికి నా పేరు తెలియదు. వాళ్లు నేను చేసిన పాత్రలతో జయమ్మ, భానుమతి అని పిలుస్తారు.. అదే నాకు అసలైన అవార్డ్. హిందీ, బెంగాలీలో అవకాశాలు వచ్చాయి. కానీ ΄ాత్రలు నచ్చక΄ోవడం, డేట్స్ కుదరక΄ోవడం వల్ల చేయలేదు. మా నాన్న (శరత్ కుమార్) నా ప్రతి సినిమా చూసి, నా నటన గురించి చెబుతారు. ‘కోట బొమ్మాళి పీఎస్’లో నా ΄ాత్రకి ఆయన ఎలాంటి వంక పెట్టలేదు.. చాలా బాగా చేశావని అభినందించారు. ప్రస్తుతం సుదీప్‌గారితో ‘మ్యాక్స్’, ధనుష్‌గారితో ‘ఢీ 50’లో చేస్తున్నాను. మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment