
వరలక్ష్మీ శరత్‌కుమార్.. లేడీ విలన్, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది. రీసెంట్‌గా హనుమాన్, కోట బొమ్మాళి పీఎస్ చిత్రాలతో మెప్పించింది. శరత్‌కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె సరైన పాత్రలు ఎంచుకుంటూ రాణిస్తుంది. త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కబోతుందనే విషయం తెలిసిందే.
ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మీ శరత్‌కుమార్ నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితం జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత తొలిసారి కాబోయే భర్తతో సరదాగా విదేశాలకు విహారయాత్రకు వెళ్లింది. ఇద్దరూ జంటగా థాయ్‌లాండ్ వెళ్లి అక్కడ సేద తీరుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నికోలయ్ సచ్‌దేవ్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నికోలయ్, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు. దంతో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment