విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన 'చికుబుకు రైలుబండి' సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 12 ఏళ్ల పాటు పక్కనపడేసిన సినిమా కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో సుమారు రూ. 100 కోట్ల వరకు రాబట్టింది.
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి(Anjali), వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. ప్రస్తుతం విడుదలైన సాంగ్‌లో ఇద్దరు హీరోయిన్లతో విశాల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment