
కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలుగులో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. క్రాక్, నాంది వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ నటికి ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాలని డిసైడ్ అయింది. తన బర్త్‌డే సందర్భంగా భాగ్యనగరానికి షిఫ్ట్ అయింది కూడా! ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
'నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు. మీరంతా ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్‌గా చేశారు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్స్. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అదే హైదరాబాద్. అవును, నేను హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. కొంత భయంగా, ఆందోళనగా ఉంది. కానీ నాకు తెలుసు, అంతా మంచే జరుగుతుందని! నేను ఎక్కడున్నా మీరంతా నా వెనకే ఉంటారని తెలుసు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. మిమ్మల్ని స్నేహితులుగా పిలవలేను, ఎందుకంటే మీరే నా కుటుంబం. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment