టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న నటి క్రేజీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం అంజమ్మ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాల్లో కనిపించిన బెంగళూరు బ్యూటీ కొత్త ఏడాదిలో హనుమాన్ చిత్రం ద్వారా పలకరించింది. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న భామ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పెళ్లి చేసుకునే విషయంపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చింది.
వివాహం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. 'పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మన లైఫ్‌లో అది ఒక పార్ట్. అంతే కానీ అది గోల్ కాదు. నేను వివాహానికి వ్యతిరేకం కాదు. ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడటం 18 ఏళ్ల క్రితమే అపేశారు. నా దృష్టిలో పెళ్లి అనేది ముఖ్యం కాదు. మ్యారేజ్ చేసుకున్నా ఓకే.. చేసుకోపోయినా ఓకే. చాలామంది పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నారు. నా బెస్ట్‌ఫ్రెండ్ త్రిష కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు.' అని అన్నారు. దీంతో పెళ్లి అనేది జీవితంలో కేవలం ఒక పార్ట్ మాత్రమేనని తనదైన శైలిలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. కానీ పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment