
హీరోయిన్లకు నిరంతరం ఎదురయే కామన్ గాసిప్ – పెళ్లి. పెళ్లికి సిద్ధమవుతున్నట్టు అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. తాజాగా ‘త్వరలోనే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతోంది. వరుడు ఫలానా క్రికెటర్. పెళ్లి తర్వాత వరలక్ష్మి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటోంది’ అంటూ ఇంటర్నెట్‌లో ఓ వార్త వైరల్ అయింది. ఆ వార్త వరలక్ష్మి కంట కూడా పడింది. వెంటనే దాన్ని కొట్టిపారేశారామె.
ఈ విషయాన్ని తన ట్వీటర్‌లో పంచుకుంటూ – ‘‘ఏంటీ నాకు పెళ్లా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనే విషయం నాకు ఆలస్యంగా తెలిసింది (వ్యంగ్య ధోరణిలో). అందరికీ నా పెళ్లి మీద అంత ఆసక్తి ఎందుకు? ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అందరికీ వినపడేలా గట్టిగా అరచి చెబుతాను. అప్పుడు నా పెళ్లి గురించి ఎంచక్కా రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాలను వదిలేయడం లేదు’’ అన్నారు వరలక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment