మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు! | Actor Varalaxmi launches 'Save Shakti' Women's protection | Sakshi
Sakshi News home page

మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు!

Published Mon, Mar 20 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు!

మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు!

పెళ్లి ప్రసక్తి మరో మూడేళ్ల వరకూ కచ్చితంగా ఉండదంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. పోడాపోడి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ మధ్య తారైతప్పట్టై  చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. పాశ్చాత్య సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగిన వరలక్ష్మి పేరిప్పుడు కోలీవుడ్‌లో మారు మోగుతోంది. ఆ మధ్య విశాల్‌తో చెట్టాపట్టాల్, త్వరలో పెళ్లి, లేదు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు అంటూ రకరకాల ప్రచారాలకు కేంద్రబిదువుగా మారిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌.ఇలాంటి వదంతుల మధ్య నటిగా తన వృత్తిలో బిజీగా ఉన్న వరలక్ష్మి ఇటీవల మహిళల రక్షణ కోసం నడుంబించారు.అందుకు సేవ్‌ శక్తి అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ విధి విధానాలు, సినిమా, వ్యక్తిగత అంశాల గురించి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో చిట్‌చాట్‌..

సేవ్‌ శక్తి సంస్థను ప్రారంభించాలన్న అనూహ్య నిర్ణయానికి కారణం?
మహిళలపై హింసాత్మక సంఘటనలనేవి మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.అయితే ఇటీవల మరీ మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నేరస్తులెవరన్నది గుర్తించగలిగేవారం.ఇప్పుడు ఎవరిలో మృగత్వం ఉందో తెలియనంతగా ఉన్నత స్థాయిలో ఉన్న వారే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరం అమ్మాయిలు అరకొర దుస్తులు ధరించడం కారణం గానే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఒక వర్గం పురుషులు చేస్తున్న ఆరోపణలు.అయితే మూడేళ్ల చిన్నారి ఎలాంటి దుస్తులు ధరించిందని పాపపుణ్యాలు కూడా చూడకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి ఆటవిక మృగాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా అవగాహన కలించాలన్న ఒక లక్ష్యంతో ప్రారంభించిన సంస్థ సేవ్‌ శక్తి.

ఇలాంటి సమాజక సేవకు ప్రత్యక్షంగా నడుంబిగించారు.వ్యక్తిగతంగా సమస్యలను ఎదర్కోవలసి వస్తుందేమో?
ఎలాంటి సమస్యలు తలెత్తవనే భావిస్తున్నాను. ఒకవేళ అలాంటివి ఎదరైనా ఫేస్‌ చేయడానికి నేను సిద్ధమే. స్త్రీ అనే నా జాతికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను.

చిత్రాలను ఎక్కువగా చేయడం లేదే?
నేను అవకాశాలను వెతుక్కుంటూ ఎప్పుడూ వెళ్లను.వచ్చిన అవకాశాల్లో నాకు బాగున్నాయనిపించిన పాత్రలనే ఎంచుకుని నటిస్తున్నాను. తారైతప్పట్టై చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయి.అందులో చాలా మంది దర్శకులు తారాతప్పట్టై చిత్రంలోని సూరావళి పాత్రలా అంటూ చెప్పడం మొదలెట్టారు. సూరావళిలా ఒక సారే నటించగలం. ప్రస్తుతం విక్రం వేద, సత్య, నిపుణన్, అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు రెండు మలయాళ చిత్రాలు అంగీకరించాను.

మీ వ్యక్తిగతం కూడా చర్చనీయాంశంగా మారింది.పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?
నటి అన్నాక ఇలాంటి చర్చనీయాంశాలు సాధారణమే. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోను. ఇక పెళ్లి అంటారా,మరో మూడేళ్ల వరకూ ఆ ప్రసక్తే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement