ప్రముఖ నటి పెళ్లికి రెడీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్‌ని నిజం చేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు జరిగింది? ఏంటి విషయం?
(ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్)
తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ఇవి కలిసి రావడంతో అలానే కొనసాగుతూ వచ్చింది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్‌తో కలిసి పనిచేసిన ఈమె.. కొన్నేళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది.
గతంలో హీరో విశాల్‌తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని నెలల గ్యాప్‌లో రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది.
నికోలయ్.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది.
(ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!)
Comments
Please login to add a commentAdd a comment