‘లక్ష్మీ’కరమైన అమ్మాయితో పెళ్లి | Vishal-Varalaxmi Sarathkumar's marriage not on the cards | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీ’కరమైన అమ్మాయితో పెళ్లి

Published Sat, Aug 13 2016 2:30 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

‘లక్ష్మీ’కరమైన అమ్మాయితో పెళ్లి

‘లక్ష్మీ’కరమైన అమ్మాయితో పెళ్లి

 సక్సెస్‌ఫుల్ కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు విశాల్. అలాగే మోస్ట్ బ్యాచిలర్ యువకుల పట్టికలో చేరిన నటుడు కూడా.తన పెళ్లిని చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం విశాల్ నటుడిగా నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరో వైపు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ప్రేమాయణం అనే వదంతులను ఎదుర్కొంటున్నారు.
 
 ఈ విషయం గురించి విలేకరులు చాలాసార్లు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన ఒకే ఒక్క సమాధానం వరలక్ష్మీ శరత్‌కుమార్ నా బాల్య స్నేహితురాలన్నదే. కాగా ఇటీవల విశాల్ ఒక ఇంటర్వ్యూలో నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత అదే ఆవరణలో జరిగే పెళ్లి తనదే అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయం గురించి నడిగర్‌సంఘం కోశాధికారి కార్తీతో చర్చించినట్లు తెలిపారు.అదే విధంగా లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నట్లు అన్నారు.
 
 దీంతో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌నే ఆ లక్ష్మీకరమైన అమ్మాయి అనే ప్రచారం సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న తన వివాహం జరుగుతుందని, ఆ తేదీన సంఘ భవనంలో వివాహానికి ముందుగానే హాలును రిజర్వ్ చేసినట్లు విశాల్ వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రేమికులుగా ప్రచారం జరుగుతున్న విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నిజంగా పెళ్లి చేసుకుంటే సంతోషకరమే కదా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement