సినిమా: మగవారికి లేదు మనమెందుకు జరుపుకోవాలి అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈమె ఇతర నటీమణులకు కాస్త భిన్నం అని చెప్పక తప్పుదు. ఏ విషయంలోనూ మొహమాటానికి పోదు. మగవారైతే వారికేమైన అదనంగా కొమ్ములుంటాయా అని ప్రశ్నించే రకం. నటనలోనూ అ అమ్మడి రూటు సపరేటే. కాగా శుక్రవారం భారతదేశం అంతా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. దేశ నాయకులంతా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి సమయంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ మాత్రం పురుషుల దినోత్సవం అంటూ లేనప్పుడు మనమెందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి అన్న ప్రశ్న లేవనెత్తింది.
నిజానికి ప్రతిరోజూ మహిళాదినోత్సవమేనని అంది. మహిళలందరూ ప్రతిరోజూ వేడుకగా జరుపుకోండి అని చెప్పింది. అంతే కాదు మీపై మీరు నమ్మకం ఉంచుకోండని అంది. సంవత్సరంలో ఒక్క రోజు కాదు ఏడాదిలో ప్రతి రోజూ మహిళలకు మర్యాద లభించడమే నిజమైన సమానత్వం అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. చైనాలో మగవారూ ప్రసవవేదనను తెలుసుకునేలా ఒక పరికరం ఉందని, దాని గురించిన ఒక వీడియోను బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ కురానా విడుదల చేసి మహిళాదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారని చెప్పింది. అదే నిజమైన మహిళాదినోత్సవం అని పేర్కొంది. అలాంటి పరికరం మన దేశానికి రావాలని నటి వరలక్ష్మీ అంది. రాజకీయాల్లోకి రావడం పక్కా అంటున్న ఈ సంచలన నటి ప్రస్తుత చిత్రాలతో చాలా బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment