హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన ప్రియుడిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. ఆమె వివాహా వేడుక థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.
తాజాగా వీరి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. హనుమాన్ చిత్రంలో మెరిసిన వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment