R. Sarathkumar
-
టాలీవుడ్ నటి మెహందీ వేడుక.. డ్యాన్స్‌తో ఇరగదీసిన ఆమె తండ్రి!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన ప్రియుడిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. ఆమె వివాహా వేడుక థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.తాజాగా వీరి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. హనుమాన్ చిత్రంలో మెరిసిన వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaasarath_love❤️ (@virad_15) -
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ పాత్రపై శరత్ కుమార్ కామెంట్స్
శరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్రముఖ నటుడు, అఖిల భారత సమత్తువ పార్టీ అధ్యక్షుడు. కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు అన్ని రకాల పాత్రలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక నటుడు అని చెప్పవచ్చు. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి మెడ్రాస్ టాకీస్ సంస్థ నిర్మించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇందులో నటుడు శరత్‌కుమార్ పెరియపళవేట్టరైయర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం తొలి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు శరత్‌కుమార్ బుధవారం ఉదయం చెన్నైలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు. చోళరాజుల ఇతివృత్తంతో కూడిన పొన్నియిన్ సెల్వన్ చరిత్ర తెలిసిన నవల అన్నారు. దీన్ని సంపూర్ణంగా తెరకెక్కించాలంటే 10 భాగాలకు పైగా పడుతుందన్నారు. అయితే మణిరత్నం ప్రధాన పాత్రలను, ప్రధాన అంశాలను మిస్ కాకుండా తాను అనుకున్న విధంగా అద్భుతంగా మలిచారన్నారు. దీనికి లైకా సంస్థ ప్రయత్నం చాలా ఉందన్నారు. అసాధారణమైన ఈ చిత్రాన్ని మణిరత్నం తన ప్రయత్నంతో సుసాధ్యం చేశారన్నారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో సుందర్ చోళన్ రాజుకు మిత్రుడు పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించానని తెలిపారు. ఇది చోళరాజ్యానికి సంరక్షణకు భద్రుడు పాత్ర అన్నారు. నందిని అనే కపటధారిణి పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించారు. ఇందులో తన అందానికి వశం కావడం, ఆమెను వివాహమాడటంతో జరిగే పరిణామాలు చిత్రంలో చూడాలన్నారు. చోళరాజుల చరిత్ర తెలియని వారికి ఈ చిత్రం పలు విషయాలను తెలియజేస్తుందన్నారు. తంజావూరులో ప్రసిద్ధి గాంచిన పెరియ కోవిల్ (ఆలయం) చోళరాజు నిర్మించిన విషయం తెలిసిందే. నున్నారు సముద్రాలను దాటి రాజ్యాలను గెలిచిన చోళ సామ్రాజ్యం కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ అన్నారు. ప్రస్తుతం తాను పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. నటుడిగా ఇది సెకెండ్ ఇన్నింగ్స్? అని అడుగుతున్నారని, అయితే తాను తొలి ఇన్నింగ్సే పూర్తి కాలేదని అన్నారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రాజకీయ పార్టీ పరమైన పనులకు ఆటంకం కలగడం లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడు రాజకీయాలు సామాజిక మాధ్యమాల్లోనే నడుస్తున్నాయని అన్నారు. తన కార్యకర్తలతో జూమ్ మీటింగ్‌లతో టచ్‌లోనే ఉంటున్నానని, ప్రజా వ్యతిరేక విధానాలను తన గొంతు వినిపిస్తునే ఉంటున్నదని శరత్‌కుమార్ చెప్పారు. -
సినిమా రివ్యూ: ట్రాఫిక్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, సూర్య (గెస్ట్ అప్పియరెన్స్) చెరన్, ప్రసన్న, పార్వతి మీనన్, ఇనియా నిర్మాత: రాధిక శరత్ కుమార్, లిసిన్ స్టిఫెన్ కథ: బాబీ సంజయ్ ఫోట్రోగ్రఫి: షెహనాద్ జలాల్ మ్యూజిక్: మేజో జోసెఫ్ దర్శకత్వం: షాహిద్ ఖాదర్ ఓ యాక్సిడెంట్ సంఘటనకు అనేక ట్విస్ట్ లను జోడించి ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, చెరన్, ప్రసన్నలతో కలిసి రూపొందించిన చిత్రం ట్రాఫిక్. తమిళంలో విజయవంతమైన చెన్నాయిల్ ఓరు నాల్ చిత్రం తెలుగులో 'ట్రాఫిక్'గా ఫిబ్రవరి 14న విడుదలైంది. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదనే ఓ సందేశంతో రూపొందిన కథేంటో ముందు చూద్దాం. యాంకర్ గా రాణించాలనే కార్తీక్ (సచిన్) కు ఓ టెలివిజన్ చానెల్ లో అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన కార్తీక్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. కానీ కార్తీక్ ఓ యాక్సిడెంట్ కు గురై.. అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గుండె మార్పిడి చికిత్స అవసరమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్ తల్లి తండ్రులను గుండె మార్పిడికి ఒప్పించడంలో వైద్యులు సఫలమవుతారు. కోదాడలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గంటన్నరలోనే గుండెను అమర్చాలి. స్వల్ప వ్యవధిలో గుండె మార్పిడి జరిగిందా? హైదరాబాద్ నుంచి కోదాడకు గంటన్నరలో ఎలా చేరుకున్నారు?. మార్గమధ్యంలో ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులను ఎలా అధిగమించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాఫిక్ చిత్రం. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గౌతమ్ కృష్ణ పాత్రలో ప్రకాశ్ రాజ్, ఆయన భార్యగా రాధిక, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా చెరన్ లు తమ పాత్రలను గొప్పగా పోషించారు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆలరించింది. విశ్లేషణ: పరిమితమైన సమయంలో గమ్యం చేరుకోవాలనే ఓ టార్గెట్ ను ప్రేక్షకులకు ముందే నిర్దేశించి.. ముందే కథలో లీనమయ్యేలా చేయడంలో సఫలమయ్యారు దర్శకులు షాహిద్ ఖాదర్. తొలి భాగంలో పాత్రలు వాటి స్వరూపాలను చక్కగా చిత్రీకరించిన దర్శకుడు.. రెండో భాగంలో తన నైపుణ్యానికి పనిచెప్పారు. హైదరాబాద్ - కోదాడ ప్రయాణంలో ఓ టెంపోను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి గుండె మార్పిడి జరుగుతుందా లేదా అనే ఆసక్తిని రేకెత్తించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడి టేకింగ్ కు మేజో జోసెఫ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోరు అదనపు అకర్షణగా మారింది. ప్రేక్షకుడికి చక్కటి ఫీల్ తోపాటు చిత్రాన్ని అందంగా, ఉత్కంఠను రేపే ఫొటోగ్రఫితో హెహనాద్ జలాల్ ఆకట్టుకున్నారు. రాధిక శరత్ కుమార్, లిసన్ స్టిఫెన్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇగో ఉన్న నటుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, డ్రైవర్ పాత్రను పోషించిన చెరన్ లు అతి కీలకమైన పాత్రలు. వైద్యుడుగా ప్రసన్న కటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెరన్ జీవితం, కార్తీక్ ప్రేమకథ, కార్తీక్ తల్లితండ్రుల భావోద్వేగం, కూతురు రక్షించుకోవాలనే బాధతో గౌతమ్ కృష్ణ గా ప్రకాశ్ రాజ్ లాంటి అంశాలు, పలు కోణాలు ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. చక్కటి ఫీల్, భావోద్వేగం, ఓ సామాజిక నేపథ్యమున్న అంశాలను జోడించి నిర్మించిన ట్రాఫిక్ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ మంచి చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ ట్రాఫిక్ అని చెప్పవచ్చు. -
కోచ్చడయాన్ ప్రపంచ సినిమా
కోచ్చడయాన్ను తమిళ చిత్రంగా చూడకండి, ఇది ప్రపంచ సినిమా అంటోంది హీరోయిన్ దీపికా పదుకునే. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో రూపొందుతున్న కోచ్చడయూన్ తొలి తమిళ 3డీ చిత్రం కావడం విశేషం. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాప్చరింగ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించిన ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకునే నటిస్తోంది. ఆమె ఇటీవల చెన్నైకి వచ్చిన సందర్భంగా కోచ్చడయాన్ గురించి మాట్లాడింది. కోచ్చడయూన్ అంతర్జాతీయ చిత్రంగా పేర్కొంది. తమిళం, ఆంగ్లం, రష్యన్, జపనీస్, చైనీస్ తదితర భాషల్లో తెరపైకి రానున్నట్లు తెలిపింది. తనను తాను తొలిసారిగా యానిమేషన్ సన్నివేశాలలో చూసి ఆశ్చర్యపోయూనని వెల్లడించిం ది. కోచ్చడయూన్లోని విజువల్ సన్నివేశాలు ఇంతవరకు ఏ భారతీయ చిత్రంలోనూ చోటు చేసుకోలేదని పేర్కొంది. రజనీకాంత్ నిజంగానే ఇండియన్ సూపర్‌స్టార్ అని పొగడ్తల వర్షం కురిపించింది. సౌందర్య అశ్విన్ శ్రమకు కచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కోచ్చడయాన్ విడుదల కోసం రజనీ అభిమానులు మాదిరిగానే తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వివరించింది. కోచ్చడయూన్ నవంబర్ 1న విడుదల కానున్నట్లు సమాచారం.