
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఐశ్వర్యా రాయ్‌ని నటుడు శరత్‌కుమార్, ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఆనందం వ్యక్తం చేశారు వరలక్ష్మి.