వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామ సమీపంలో సోమవారం ఉదయం కారు బోల్తాపడి ఒక వ్యక్తి మృతిచెందాడు.
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామ సమీపంలో సోమవారం ఉదయం కారు బోల్తాపడి ఒక వ్యక్తి మృతిచెందాడు. చిలమకూరు ఐసీఎల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సంతోష్‌కుమార్(38) సోమవారం ఉదయం కడప నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో సంతోష్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఎర్రగుంట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.