సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్: నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేవిధంగా అర్బన్ పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. దివంగతనటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేరిట ఆయన హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్‌ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలసి నాగార్జున ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.
చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని 1,080 ఎకరాల భూమిని దత్తత తీసుకుంటు న్నట్టు ఆయన ప్రకటించారు. నాగార్జున వెంట భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటవీపార్కు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంక ల్పించిన హరితనిధికి రూ.2 కోట్ల చెక్‌ను నాగార్జున అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు.
బిగ్‌బాస్ ఫైనల్‌లో ఇచ్చిన మాట ప్రకారం..
గత బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉం దని నాగార్జున అన్నారు. అడవిని దత్తత తీసుకునేం దుకు నాగార్జున ముందుకు రావడాన్ని ఎంపీ సం తోష్ ప్రశంసించారు. అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతంలో దశలవారీగా లక్ష మొక్క లను నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి నట్లు చెప్పారు. నాగార్జున, సంతోష్ వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
చదవండి: (సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ)
Comments
Please login to add a commentAdd a comment