సంతోష్ మృతదేహం కోసం ఎదురుచూపులు
విశాఖపట్నం: న్యూజిలాండ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంతోష్ కుమార్ మృతదేహం కోసం అతడి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు యాక్సిడెంట్లోల మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంతోష్ మృతితో బంధువులు, కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సంతోష్ మృతి చెంది అయిదురోజులు గడుస్తున్న మృతదేహం స్వస్థలానికి రాక పోవడంతో విశాఖలోని అక్కయ్యపాలెంలో నందగిరి నగర్లో విషాధఛాయలు అలుముకున్నాయి.
విశాఖపట్నం నగరానికి చెందిన సంతోష్‌కుమార్ పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక నాలుగు నెలల కిందట అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం జనవరి 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.