
జగన్‌కు మద్దతుగా ఆమరణ దీక్ష
కూకట్‌పల్లి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా కూకట్‌పల్లి ఆర్టీసీ కాలనీకి చెందిన పి.సంతోష్ కుమార్ ఆమరణ దీక్ష చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.
చికిత్స కోసం ఆయనను సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు స్థానిక రాందేవ్‌రావ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ ముజిద్ వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. ఆయనకు రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు.