విజయవాడ (కృష్ణలంక): నగరంలోని పనికి వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందిన సంఘటన బస్టాండ్ డార్మిటరీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా, పలాసకు చెందిన అల్లు సంతోష్‌కుమార్(29) మొబైల్ కంపెనీలో రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
అతనికి పదేళ్ల క్రితం శ్వాసకోశవ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. తర్వాత కాలంలో చికిత్స చేయించుకోవడంతో ఆరోగ్యం కుదుటపడ్డాడు. నెలరోజుల క్రితం నగరంలోని ఆ కంపెనీ పనులు నిర్వర్తించేందుకు వచ్చాడు. బస్టాండ్ డార్మిటరీలో అద్దెకు ఉన్నాడు. ఈక్రమంలో మంగళవారం అస్వస్థతగా ఉందని డార్మిటరీ రిసెప్షన్‌లో పనిచేసే వ్యక్తికి సంతోష్ చె ప్పి వేడినీరు తాగేందుకు ఇవ్వాలని అడిగాడు.
అంతలోనే వద్దని చెప్పి సమీపంలోని కుర్చీలో కూర్చొని, కిందపడ్డాడు. వెంటనే రిసెప్షన్‌లో వ్యక్తి 108కు ఫోన్ చేసి రప్పించగా, వారు చనిపోయినట్లుగా నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. సంతోష్ నాలుగు సంవత్సరాల క్రితం స్వాతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంతోష్ మృతిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
Published Tue, Jun 21 2016 11:41 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
Advertisement
Advertisement