సాక్షి, న్యూఢిల్లీ: గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశ విదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ‘వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్’అవార్డు లభించింది. శనివారం రాజస్థాన్‌లో జరిగిన వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్, ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబాల నుంచి సంతోష్‌కుమార్ తరపున గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవళ్ల రాఘవ, మర్ది కరుణాకర్‌రెడ్డిలు అవార్డును స్వీకరించారు.
‘ఈ అవార్డు నాది మాత్రమే కాదు. నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిదీ’అని సంతోష్ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి ఎరిక్ సోలిమ్ శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment