![Hyderabad: MP Santosh Kumar Extends Rs 3 Lakh Assistance - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/11/VENNELA.jpg.webp?itok=OuWQumwo)
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట గ్రామ గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెల ఈనెల 19 నుంచి కిలిమంజారో (5,895 మీటర్ల) పర్వతాన్ని అధిరోహించనుంది. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా వెన్నెలకు సంతోష్ రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి ఆశీర్వదించారు. భవిష్యత్‌లో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని వెన్నెల తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment