పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీకి ఎంపీ సంతోష్‌కుమార్‌  | Santosh Kumar Appointed As MP for Public Undertakings Committee | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీకి ఎంపీ సంతోష్‌కుమార్‌ 

Published Sat, Mar 21 2020 3:53 AM | Last Updated on Sat, Mar 21 2020 3:53 AM

Santosh Kumar Appointed As MP for Public Undertakings Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీకి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్‌సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు, మొత్తంగా 22 మంది కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్యతా ఓటు ఆధారంగా రెండు సభలకు చెందిన ఎంపీలు ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. కమిటీకి చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయటం, వాటి ఖాతాలను పరిశీలించటంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ కేంద్రానికి నివేదికలు అందజేస్తుంది. పార్లమెంటరీ కమిటీకి తాను ఎంపిక కావటంపై సంతోష్‌కుమార్‌ సంతృప్తి వ్యక్తంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement