
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ సంతోష్‌కుమార్ విసిరిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను స్వీకరించిన సినీ నటుడు కృష్ణ మంగళవారం మొక్కలు నాటారు. తమిళ నటుడు రజనీకాంత్, తెలుగు నటులు వెంకటేశ్, పవన్ కళ్యాణ్‌కు సవాలు విసిరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించిన సంతోష్‌కుమార్‌ను అభినందించిన కృష్ణ, త్వరలోనే ఇది 10 కోట్ల మొక్కలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment