జుట్టుకోసం సర్జరీ.. విఫలమై ప్రాణం హరీ! | Surgery about hair and died | Sakshi
Sakshi News home page

జుట్టుకోసం సర్జరీ.. విఫలమై ప్రాణం హరీ!

Published Wed, Jun 8 2016 1:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Surgery about hair and died

సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన క్రాఫ్‌పై మోజుపడి ఓ విద్యార్థి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. మద్రాస్ మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో ఇబ్బంది పడేవాడు. ‘సర్జరీతో జుట్టు తెప్పిస్తాం’ ప్రకటనకు ఆకర్షితుడై నుంగంబాక్కంలోని వైద్యుని వద్దకు వెళ్లాడు. పొద్దున మత్తుమందిచ్చి సర్జరీ ప్రారంభించారు.

సాయంత్రం స్పృహలోకొచ్చిన సంతోష్ కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వేలూరు ఆసుపత్రికి తరలించగా అక్కడే చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement