Madras Medical College
-
జుట్టుకోసం సర్జరీ.. విఫలమై ప్రాణం హరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన క్రాఫ్‌పై మోజుపడి ఓ విద్యార్థి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. మద్రాస్ మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో ఇబ్బంది పడేవాడు. ‘సర్జరీతో జుట్టు తెప్పిస్తాం’ ప్రకటనకు ఆకర్షితుడై నుంగంబాక్కంలోని వైద్యుని వద్దకు వెళ్లాడు. పొద్దున మత్తుమందిచ్చి సర్జరీ ప్రారంభించారు. సాయంత్రం స్పృహలోకొచ్చిన సంతోష్ కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వేలూరు ఆసుపత్రికి తరలించగా అక్కడే చనిపోయాడు. -
బట్టతలపై జుట్టు వస్తుందని చెబితే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన తలకట్టు ఉండాలని ఎవరూ అనుకోరు.. పిన్నవయస్సు నుంచి వృద్ధ వయస్సు దాకా అందరూ ఒతైన జుట్టు కావాలని ఆరాటపడుతుంటారు. దువ్వెన తలనే పదేపదే దువ్వుతూ మురిసిపోతుంటారు. వృద్ధ వయస్సులో రావాల్సిన బట్టతల ముందుగానే వస్తే.. అంతే..! తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. తలపై జుట్టు పెరిగే ఉపాయాల జాబితా తిరిగేస్తారు.. ఎవరైనా పలనా తింటే.. జుట్టు పెరుగుతుందనీ, ఔషధం రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబితే ఆ వ్యక్తి ఊహాలకు రెక్కలు తొడుగుతాయి. బట్టతల నుంచి విముక్తి పొందలన్నా అత్యాశతో ఎంత ఖర్చుకైనా వెనకాడరు. అచ్చంగా అలాగే చేసాడో వైద్యవిద్యార్థి. తన అందమైన క్రాఫ్‌పై మోజుపడిన విద్యార్థి ఏకంగా తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ దయనీయమైన ఘటన చెన్నైలో మంగళవారం వెలుగుచూసింది. మద్రాసు మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో తెగ ఇబ్బంది పడేవాడు. ‘బట్టతల మీ వివాహానికి అడ్డంకిగా మారిందా. దిగులుపడొద్దు. మా వద్దకు రండి. అందమైన క్రాఫ్‌ను అమరుస్తాం’ అనే ప్రకటనకు ఆకర్షితుడైన అతడు నుంగంబాక్కంలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. అక్కడి అనస్తీషియా డాక్టర్ చైనాలోని ఒక వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మరో విద్యార్థి సాయంతో సంతోష్‌కుమార్‌కు మత్తుమందు ఇచ్చి చికిత్స ప్రారంభించారు. ఉదయం ప్రారంభించిన చికిత్స సాయంత్రం వరకు కొనసాగగా సృహలోకి వచ్చిన సంతోష్‌కుమార్ తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వేలూరు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అనుభవం లేకుండా బట్టతలకు జుట్టు అమర్చేందుకు చేసిన ప్రయత్నం వికటించిన కారణంగానే సంతోష్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడని అనుమానిస్తూ కుటుంబసభ్యులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. -
30 ఏళ్ల క్రితం దేశం షాక్ తిన్నది!
సరిగ్గా 36 ఏళ్ల కిందట 1986 జూన్ నెలలో ఓ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లోకి సైతం అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్ ప్రవేశించిందని వెల్లడికావడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. మహిళా డాక్టర్ అయిన సునీతి సోలోమన్ ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా కనుగొని దేశమంతటా కలకలం రేపారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిగా ఉన్న ఆమె ఓ పరిశోధక ప్రాజెక్టులో భాగంగా 100 మంది సెక్స్ వర్కర్లను పరీక్షించారు. మద్రాస్‌లోని ఓ చిన్న ప్రాథమిక ల్యాబ్‌లో ఆమె నిర్వహించిన పరీక్షలు మున్ముందు దేశానికి వైద్యపరంగా పెను సవాలు విసురుతాయని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. డాక్టర్ సునీతి 100 మంది సెక్స్‌వర్కర్లను పరీక్షించగా అందులో ఆరుగురికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. హెచ్ఐవీ వైరస్ భారత్‌లోకి ప్రవేశించిందని తెలియడం అదే తొలిసారి. ఈ పరీక్షలే మున్ముందు దేశానికి ఎదురవుతున్న పెను వైద్య సవాల్‌ను వెల్లడించడమే కాకుండా.. ఇందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటాయి. షాక్ గురయ్యారు! 'పరీక్షల్లో ఏదో వెల్లడి అవుతుందని అనుకోవద్దని ఆమె ముందే తన నేతృత్వంలోని పరిశోధక విద్యార్థులకు చెప్పారు. తమ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో పూర్తిగా నెగిటివ్ ఫలితాలు వస్తాయని ఆమె ఆశించారు. కానీ పాజిటివ్ ఫలితాలు రావడం ఆమెను షాక్‌కు గురిచేసింది' అని డాక్టర్ సునీతి తనయుడు డాక్టర్ సునీల్ సోలోమన్ గుర్తుచేసుకున్నారు. 'ప్రభుత్వం ఈ పరీక్షల ఫలితాలను అంగీకరించడానికి ఒప్పుకోలేదు. పాశ్చాత్య దేశాల కన్న ఉన్నత సంప్రదాయాలు అనుసరించే భారత్ వంటి దేశంలో ఇలాంటి వైరస్ ప్రవేశించే ఆస్కారం ఉండదని అప్పట్లో ప్రభుత్వం భావించింది. కానీ పరీక్ష నమూనాలను వాషింగ్టన్ పంపి.. అక్కడ కూడా పాజిటివ్‌గానే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది' అని సునీల్ తెలిపారు. ఇప్పటికీ హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి ముప్పు భారత్‌ను వేధిస్తూనే ఉంది. సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం వంటి అవసరాన్ని, లైంగిక విద్య ఆవశ్యకతను ఇది చాటుతోంది.