'కెప్టెన్గా కఠిన నిర్ణయాలు తప్పవు'
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన విమర్శలపై ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందించాడు. 1999లో వెస్టిండీస్తో టెస్టు మ్యాచ్లో వార్న్ను తుది జట్టులోకి తీసుకోకపోవడానికి జట్టు ప్రయోజనాలే కారణమని, కెప్టెన్గా తన బాధ్యతలను నిర్వర్తించానని, కఠిన నిర్ణయాలు తప్పవని ఆనాటి సంఘటనను స్టీవ్ వా వెల్లడించాడు.
స్టీవ్ వా స్వార్థపరుడని, తాను ఆడిన క్రికెటర్లలో అతనే అత్యంత స్వార్థపరుడంటూ వార్న్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై స్టీవ్ వా స్పందిస్తూ.. ఓ సమాధానంతో వార్న్ వ్యాఖ్యలను ఖండించలేనని అన్నాడు. తుది జట్టు నుంచి వార్న్ను తొలగించాలన్నది కఠిన నిర్ణయమని, అయితే కెప్టెన్గా తన విధులను నిర్వర్తించానని చెప్పాడు. వార్నే కాదు ఏ ఆటగాడినయినా తొలగించాలన్నది సులభం కాదని, జట్టు ప్రయోజనాల రీత్యా తప్పదని అన్నాడు.