మెల్‌బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై సుతి మెత్తని విమర్శలు చేసిన షేన్ వార్న్.. తాజాగా మరో మాజీ కెప్టెన్ స్టీవ్‌పై కూడా కామెంట్స్ చేశాడు. లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లంతో ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియాలో ముచ్చటించే క్రమంలో గతాన్ని తవ్వి మరీ వెలిక్కి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్న్ బదులిచ్చాడు. అది స్టీవ్ వా గురించి అడగ్గా అతనొక స్వార్థ క్రికెటర్ అంటూ సంచలన వ్యాక్యలు చేశాడు. ఇక్కడ తానేమీ స్టీవ్ వా అంటే ద్వేషం లేదని, కేవలం అతను మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నానన్నాడు. (ఆ బ్యాట్‌ను అఫ్రిది సొంతం చేసుకున్నాడు..)
అతను అత్యధిక రనౌట్లలో భాగమైన గణాంకాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు. స్టీవ్ వా తన బ్యాటింగ్‌తో ఆసీస్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఆసీస్‌కు ఒక వరల్డ్‌కప్‌ను కూడా సాధించి పెట్టిన ఘనత కూడా స్టీవ్ వాది. కానీ, ఒక్క చెత్త రికార్డు కూడా స్టీవా పేరిట ఉంది. అది రనౌట్లలో భాగమైన రికార్డు. స్టీవ్ వా ఓవరాల్‌గా 104 సార్లు రనౌట్లలో భాగమైతే, అందులో 73 సార్లు తన సహచర బ్యాటింగ్ పార్టనర్‌లనే ఔట్ అయ్యారు. దీన్ని ఉద్దేశిస్తూనే ఒక ప్రశ్నను వార్న్‌ను అడగ్గా అందుకు సమాధానంగా స్టీవ్ వా కచ్చితంగా స్వార్థ క్రికెటరే అని పేర్కొన్నాడు. తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్ వానే మోస్ట్ సెల్ఫిష్ అని అన్నాడు. కొన్ని రోజుల క్రితం 2005 యాషెస్ సిరీస్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టు గురించి మాట్లాడుతూ ఆనాటి మ్యాచ్‌లో తమ ఓటమికి రికీ పాంటింగ్ తీసుకున్న నిర్ణయమే కారణమన్నాడు. బ్యాటింగ్ అనుకూలించే వికెట్‌పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్ ఎంచుకోవడం అతి పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. ఆ నిర్ణయం ఇంగ్లండ్‌కు మేలు చేయడంతోనే తాము రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామన్నాడు. ('సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్')
Comments
Please login to add a commentAdd a comment