లండన్: ఇటీవల ఆసీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్వార్థపరడంటూ తన ఆత్మకథ ‘నో స్పిన్’లో పేర్కొన్న షేన్ వార్న్.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తన క్రికెట్ కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించిన విషయాన్ని వార్న్ వెల్లడించాడు. ప్రధానంగా క్రికెటర్లతో ఉన్న రిలేషన్‌షిప్స్‌తో పాటు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గురించి పేర్కొన్న వార్న్.. 1994-95 సీజన్‌లో పాకిస్తాన్‌తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సలీం మాలిక్ లంచాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపాడు.
తాను ఆఫ్ స్టంప్ బంతులు వేయాలని కోరిన మాలిక్, అందుకు దాదాపు రెండు లక్షల యూఎస్ డాలర్లను ఇవ‍్వబోయాడన్నాడు. మరొక సందర్భంలో ఒక బుకీ కూడా తనను కొనుగోలు చేయడానికి యత్నించాడన్నాడు. అతను శ్రీలంకకు చెందిన బుకీగా వార్న్ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఐదువేల డాలర్లను తాను పొగొట్టుకున్నానని, దాన్ని సహచర క్రికెటర్ మార్క్ వా ఇవ్వబోతే వద్దనన్నాడు.
ఇదిలా ఉంచితే, తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వార్న్ వివరించాడు. ‘ నా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలంటే సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం ఒకటైతే, అటు తర్వాత ఎలిజిబెత్ హర్లీతో తెగతెంపులు. ఈ రెండే నా వివాహ జీవితంలో చవిచూసిన చేదు జ్ఞాపకాలు. వారితో విడిపోయినప్పటికీ ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నాం’ అని వార్న్ పేర్కొన్నాడు.
చదవండి: స్టీవ్ వా స్వార్థపరుడు
Comments
Please login to add a commentAdd a comment