Courtesy: IPL Twitter
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించారు. జస్టిన్ లాంగర్ తర్వాత ఈ ఫిబ్రవరిలో మెక్ డొనాల్డ్‌కు తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. తాజా గా ఆయన్నే నాలుగేళ్ల పాటు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించారు. ఆయన కోచింగ్‌లోని ఆస్ట్రేలియా ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో 1–0తో టెస్టు సిరీస్ గెలిచింది. వన్డేల్లో 1–2తో ఓడి ఏకైక టి20లో నెగ్గింది.
‘కీలకమైన బాధ్యతల కోసం మేం చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం. అయితే మెక్‌డొనాల్డ్ తానేంటో ఇదివరకే నిరూపించుకున్నారు. ఆయన పనితీరు, అంకితభావం నచ్చే నాలుగేళ్ల కాంట్రాక్టు ఇచ్చాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపారు. గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్ 2019లో ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో చేరారు. ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడి మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు.
చదవండి: IPL 2022: ఒకే ఓవర్‌లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment