Andrew McDonald
-
2027 వరకు హెడ్ కోచ్‌గా అతడే.. సీఏ ప్రకటన
ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్ ముగిసేదాకా మెక్డొనాల్డే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా మెక్‌డొనాల్డ్ ఆసీస్ జట్టుతో ఉంటాడు. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్‌డొనాల్డ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్ కప్మెక్డొనాల్డ్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.అందుకే పొడిగించాంఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్‌డొనాల్డ్‌పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు. జట్టు నిలకడైన విజయాల్లో మెక్‌డొనాల్డ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్‌డొనాల్డ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్..?
ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారధిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్ డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆసీస్ టీ20 జట్టు సారధిగా మార్ష్‌కు ఘనమైన రికార్డే ఉంది. మెక్ డొనాల్డ్ మార్ష్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తుంది. 32 ఏళ్ల మార్ష్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్‌లో మార్ష్ బ్యాటర్‌గా కూడా రాణించి (92 నాటౌట్, 79 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్.. ఈ సిరీస్‌లోనూ ఆసీస్‌ను విజయపథాన నడిపించాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ మార్ష్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మార్ష్‌కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మార్ష్.. తన కెరీర్లో 54 టీ20లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడటం లేదు. టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. -
మూడు ఫార్మాట్లలోనూ అతడొక అద్బుతం.. నిజంగా మాకు ఇది: ఆసీస్ హెడ్ కోచ్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్ విడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని వార్నర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. . జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టు జరగనుంది. తన సొంత మైదానంలో అద్బుతప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌పై ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. డేవిడ్ వార్నర్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతొడక ఆల్‌ఫార్మాట్ ప్లేయర్. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ. గత కొంతకాలం నుంచి వార్నర్ టెస్టు క్రికెట్ ఫామ్‌పై చాలా మంది విమర్శలు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఒక జట్టుగా మేము అతడిపై నమ్మకం ఉంచాము. అందుకే పాకిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేశాము. తొలి టెస్టు మ్యాచ్‌లోనే తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఏదైమైనప్పటికి అతడి స్థానాన్ని భర్తీ చేయడం మాకు చాలా కష్టం. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడు. మేము మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వార్నర్‌కు అంకితమివ్వాలని భావిస్తున్నాము అని క్రికెట్ ఆస్ట్రేలియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
జడ్డూ లేకుంటే టీమిండియా బలహీనపడుతుందనుకుంటే.. ఇలా: ఆసీస్ కోచ్
Australia tour of India, 2022- Ind Vs Aus 3rd T20- Hyderabad: టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌తో సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియాకు బలహీనతగా మారుతుందనుకుంటే.. అక్షర్ రూపంలో వారికి మంచి ప్రత్యామ్నాయం దొరికిందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. 2-1తో ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ జడేజా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అదరగొట్టిన అక్షర్ పటేల్.. ఆసీస్ కోచ్ ప్రశంసలు ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందుకు తగ్గట్టుగా రాణించాడు ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్. మొదటి మ్యాచ్‌లో 3, రెండో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్.. నిర్ణయాత్మక మూడో టీ20లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆండ్రూ మెక్‌డొనాల్డ్(PC: CA) ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన మూడో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడిన ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అక్షర్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ సిరీస్‌లో అక్షర్ అదరగొట్టాడు. జడ్డూ లేకుంటే భారత జట్టు బలహీనపడుతుందని భావిస్తే అక్షర్ ఆ లోటును పూడ్చాడు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని.. ప్రపంచకప్ టోర్నీలో అతడు ప్రమాదకర బ్యాటర్‌గా మారి సవాల్ విసరగలడని పేర్కొన్నాడు. కాగా ఆఖరి టీ20లో రోహిత్ సేన ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్‌కప్ ఫైనల్ అయితే! -
ఆసీస్ హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించారు. జస్టిన్ లాంగర్ తర్వాత ఈ ఫిబ్రవరిలో మెక్ డొనాల్డ్‌కు తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. తాజా గా ఆయన్నే నాలుగేళ్ల పాటు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించారు. ఆయన కోచింగ్‌లోని ఆస్ట్రేలియా ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో 1–0తో టెస్టు సిరీస్ గెలిచింది. వన్డేల్లో 1–2తో ఓడి ఏకైక టి20లో నెగ్గింది. ‘కీలకమైన బాధ్యతల కోసం మేం చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం. అయితే మెక్‌డొనాల్డ్ తానేంటో ఇదివరకే నిరూపించుకున్నారు. ఆయన పనితీరు, అంకితభావం నచ్చే నాలుగేళ్ల కాంట్రాక్టు ఇచ్చాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపారు. గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్ 2019లో ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో చేరారు. ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడి మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2022: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్