
టీ20 ప్రపంచకప్-2022కు ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును గురువారం ప్రకటించింది. తొలి టీ20కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మిగితా రెండు టీ20లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
అయితే ఈ సిరీస్‌లో తొలి టీ20కు స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్,ఆడమ్ జంపాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కాగా వీరి స్థానంలో స్టోయినిస్, ఆగర్, రిచర్డ్‌సన్ జట్టులోకి వచ్చారు.
ఇక ఇంగ్లండ్-ఆసీస్ మధ్య తొలి టీ20 పెర్త్ వేదికగా ఆక్టోబర్ 9న జరగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌తో రెండు టీ20 సిరీస్‌లో తలపడుతోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 15నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, అష్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్, నాథన్ ఇల్లీస్, కేన్ రిచర్డ్సన్
ఇంగ్లండ్‌తో మిగితా రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కేన్ జంపా
చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment