టీ20 వరల్డ్‌కప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోవిడ్ బారిన పడగా.. రేపు (అక్టోబర్ 28)ఇంగ్లండ్‌తో జరుగబోయే కీలక పోరుకు ముందు జట్టులో ఉన్న ఏకైక వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ఱారణ అయ్యింది. జట్టులో బ్యాకప్ వికెట్‌కీపర్ కూడా లేకపోవడంతో ఆసీస్ యాజమాన్యం ఆందోళన చెందుతుంది.
తొలుత వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బ్యాకప్ వికెట్‌కీపర్‌గా జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసినప్పటికీ.. గాయం కారణంగా అతను టోర్నీ ఆరంభానికి ముందే నిష్క్రమించాడు. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆసీస్ యాజమాన్యం వేడ్‌నే ఎలాగైనా బరిలోకి దించాలని యోచిస్తుంది. ప్రస్తుతానికి వేడ్‌లో కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఇంగ్లండ్‌తో మ్యాచ్ చాలా కీలకం కావడంతో వేడ్‌ను తప్పనిసరిగా బరిలోకి దించే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన కీలక వ్యక్తి వెల్లడించారు.
ఒకవేళ మ్యాచ్ సమయానికి వేడ్‌లో కోవిడ్ లక్షణాలు అధికమైతే.. అతని స్థానంలో మ్యాక్స్‌వెల్, వార్నర్‌లతో ఎవరో ఒకరికి కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సీఏ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇవాళ మ్యాక్స్‌వెల్, వార్నర్ ఇద్దరూ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు.
కాగా, కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ కోవిడ్ నిర్ధారణ అయ్యినప్పటికీ బరిలోకి దిగాడు.
ఇదిలా ఉంటే, టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన ఆతిధ్య జట్టుకు.. ఇంగ్లండ్‌పై గెలిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి రేపటి మ్యాచ్‌లో ఆసీస్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని యోచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment