Australia wicket-keeper
-
ఆసీస్‌కు భారీ షాక్.. మరో ప్లేయర్‌కు కరోనా, బ్యాకప్ కూడా లేడు..!
టీ20 వరల్డ్‌కప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోవిడ్ బారిన పడగా.. రేపు (అక్టోబర్ 28)ఇంగ్లండ్‌తో జరుగబోయే కీలక పోరుకు ముందు జట్టులో ఉన్న ఏకైక వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ఱారణ అయ్యింది. జట్టులో బ్యాకప్ వికెట్‌కీపర్ కూడా లేకపోవడంతో ఆసీస్ యాజమాన్యం ఆందోళన చెందుతుంది. తొలుత వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బ్యాకప్ వికెట్‌కీపర్‌గా జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసినప్పటికీ.. గాయం కారణంగా అతను టోర్నీ ఆరంభానికి ముందే నిష్క్రమించాడు. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆసీస్ యాజమాన్యం వేడ్నే ఎలాగైనా బరిలోకి దించాలని యోచిస్తుంది. ప్రస్తుతానికి వేడ్‌లో కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఇంగ్లండ్‌తో మ్యాచ్ చాలా కీలకం కావడంతో వేడ్‌ను తప్పనిసరిగా బరిలోకి దించే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన కీలక వ్యక్తి వెల్లడించారు. ఒకవేళ మ్యాచ్ సమయానికి వేడ్‌లో కోవిడ్ లక్షణాలు అధికమైతే.. అతని స్థానంలో మ్యాక్స్‌వెల్, వార్నర్‌లతో ఎవరో ఒకరికి కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సీఏ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇవాళ మ్యాక్స్‌వెల్, వార్నర్ ఇద్దరూ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. కాగా, కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ కోవిడ్ నిర్ధారణ అయ్యినప్పటికీ బరిలోకి దిగాడు. ఇదిలా ఉంటే, టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన ఆతిధ్య జట్టుకు.. ఇంగ్లండ్‌పై గెలిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి రేపటి మ్యాచ్‌లో ఆసీస్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం..!
ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్, ప్రస్తుత నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ (50)కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ర్యాన్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ర్యాన్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్గజ వికట్కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సమకాలికుడైన ర్యాన్ క్యాంప్‌బెల్ 2002 సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలు ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో గిల్‌క్రిస్ట్ పాతుకుపోవడంతో ర్యాన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అతను హాంగ్‌కాంగ్ జట్టుకు వలన వెళ్లాడు. హాంగ్‌కాంగ్ జట్టు తరఫున మూడు టీ20లు ఆడాడు. అనంతరం 2017లో నెదర్లాండ్స్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. చదవండి: ఢిల్లీ జట్టులో కరోనా కలకలం.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌పై బిగ్ అప్డేట్ -
ఆసీస్ వికెట్ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు
అబుదాబీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆరవ సీజన్ పునఃప్రారంభానికి ముందు లాహోర్ ఖలందర్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్, ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ డంక్ ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అబుదాబిలో క్యాచ్ ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ముఖానికి బలంగా తాకడంతో పెదవులపై ఏకంగా ఏడు కుట్లు పడ్డాయి. దీంతో అతను శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఖలందర్స్ జట్టులో డంక్ కీలక ఆటగాడు కావడంతో ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం పడనుందని ఆ ఫ్రాంఛైజీ సీఈఓ సమిన్ రానా పేర్కొన్నాడు. పీఎస్ఎల్ 2021 తొలి భాగంలో డంక్.. 40 సగటుతో 80 పరుగులు సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగలతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా వాయిదా పడిన పీఎస్ఎల్ యూఏఈ వేదికగా జూన్ 9 నుంచి పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పీఎస్ఎల్లో ప్రస్తుతం ఖలందర్స్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్ళు షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, హరిస్ రౌఫ్‌తో పాటు విదేశీ స్టార్లు రషీద్ ఖాన్, డేవిడ్ వీజ్, సమిత్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉంటే, బెన్ డంక్ ఆస్ట్రేలియా తరఫున ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఏళ్ల డంక్.. 2014 నవంబర్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. చదవండి: డబ్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు కష్టమే.. -
వన్డేలకు హాడిన్ వీడ్కోలు
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ విజయానంతరం గత మార్చిలోనే తాను ఇక వన్డేలు ఆడలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 126 వన్డేలు ఆడిన హాడిన్ 3,122 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 170 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు చేశాడు. ‘నా వన్డే కెరీర్ అద్భుతంగా సాగింది. ఆసీస్ తరఫున మూడు ప్రపంచకప్‌ల్లో పాలుపంచుకున్నాను. ఇక ముగింపునకు ఇదే సరైన సమయంగా భావించాను’ అని 37 ఏళ్ల హాడిన్ తెలిపాడు. అయితే టెస్టు ఫార్మాట్లో కొనసాగుతున్న హాడిన్ నేడు (సోమవారం) వెస్టిండీస్, ఇంగ్లండ్‌లతో టెస్టు సిరీస్ కోసం జట్టుతో పాటు వెళ్లనున్నాడు.