స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2022లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి పరువు పోగొట్టుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు.. ఆ బాధ నుంచి తేరుకోకముందే మరో భారీ షాక్ తగిలింది. శనివారం (నవంబర్ 12) జరిగిన స్నేహితుడి బర్త్ డే పార్టీలో ప్రమాదవశాత్తు జారిపడిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాలు విరగొట్టుకున్నాడు. దీంతో వరల్డ్‌కప్ అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి అతను దూరమయ్యాడు.
మాక్స్‌వెల్ కాలికి ఇవాళ సర్జరీ చేసిన డాక్టర్లు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందిగా సూచించారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. వైట్ బాల్ క్రికెట్‌లో ఆసీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న మ్యాక్సీ.. మూడు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటం ఆ జట్టు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం లాంఛనమే అయిన నేపథ్యంలో సీనియర్ సభ్యుడు మ్యాక్సీ కూడా దూరం కావడం ఆ జట్టు కష్టాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో సీనియర్ల రిటైర్మెంట్‌తో ఇబ్బంది పడుతున్న ఆసీస్‌కు మ్యాక్సీ గాయం మరింత ఆందోళన కలిగిస్తుంది. కాగా, ఆసీస్ పర్యటనలో వరల్డ్‌కప్‌కు ముందు టీ20 సిరీస్ ఆడిన ఇంగ్లండ్.. నవంబర్ 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో 3 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి: T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment