న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోనేందుకు వస్తున్న ఐదారు వ్యాక్సిన్లలో అగ్రగామిగా నిలుస్తున్న ఫైజర్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు ఓ దశలో భారత్‌కు కూడా సిద్ధపడింది. అత్యంత శీతల కేంద్రాల్లో ఫైజర్‌ను నిల్వ చేయాల్సిన అవసరం ఉండడంతో అందుకు తగిన విధంగా ముంబై, అంతర్జాతీయ విమానాశ్రంలోని మందుల నిల్వ చేసే శీతల గిడ్డంగిలో ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదిక చేపట్టింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ ఒక్క డోసుకు 40 డాలర్లు, దాదాపు 2,900 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని తెలిసి ఏర్పాట్లకు స్వస్తి చెప్పింది. మామూలు శీతల కేంద్రాల్లో భద్రపరిచే మోడొర్నా వ్యాక్సిన్ డోసు ధర కూడా 40 డాలర్లకన్నా ఎక్కువేనని తెలియడంతో ఆ ప్రయత్నాలను భారత ప్రభుత్వం విరమించుకుంది. (చదవండి : కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు)
ఫైజర్ వ్యాక్సిన్ డోసులను అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పటికే కొనుగోలు చేయగా, మరికొన్ని ధనిక దేశాలు కూడా ఆ డోసుల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశంలోని ధనిక వర్గాలు కొనుగోలు చేసుకోవాలనుకున్నా ఇప్పటికే కుదరిని ఒప్పందాల మేరకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ఫైజర్ కంపెనీకి దాదాపు ఏడాది పడుతుంది. అమెరికా ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ డోసుల సరఫరాకు మోడొర్నా కంపెనీ కోట్లాది డాలర్లను ముందస్తు ఒప్పందం కిందనే తీసుకుంది. ఫైజర్, మోడొర్నా కంపెనీలు దాదాపు 70 నుంచి 80 శాతం లాభాలను చూసుకోవడం వల్లనే వాటి వ్యాక్సిన్ల ధరలు అంత ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రస్తుతం భారత్‌తోపాటు వర్ధమాన దేశాలకు అందుబాటులో ఉంది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోసం గేట్స్ ఫౌండేషన్ ముందస్తు ఒప్పందం చేసుకున్నందున భారత్‌కు మూడు, నాలుగు వందలకు ఓ డోస్ చొప్పున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాము పెద్దగా లాభాలు చూసుకోవడం లేదని ఆస్ట్రాజెనికా చెప్పినప్పటికీ వంద మిలియన్ డాలర్ల లాభాలు, దాదాపు 736 కోట్ల రూపాయలు వచ్చేలాగానే అని ధరలను నిర్ణయిస్తోంది. ఆ కంపెనీ తక్కువ మొత్తాలకు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఆ కంపెనీ షేర్ల విలువలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయాయి. ఫైజర్, మోడొర్నా షేర్ల విలువలు అనూహ్యంగా పెరగి పోయాయి.
భారత్ దరఖాస్తుకు వ్యతిరేకత
ఫైజర్, మోడొర్నా లాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు అధిక లాభాలు చూసుకోకుండా నియంత్రించేందుకు వాక్సిన్లపై అంతర్జాతీయ ప్రాపర్టీ హక్కులను ఎత్తివేయాలంటూ దక్షణాఫ్రికాతో కలిసి భారత్ పెట్టిన దరఖాస్తును అమెరికా, బ్రిటన్, ఐరోపా కూటమి తిరస్కరించాయి. చైనా, రష్యా దేశాలు సొంతంగా వ్యాక్సిన్లు రూపొందించాయి. ఫైజర్, మోడొర్నా వ్యాక్సిన్లు ధనిక దేశాలపై తమ దష్టిని కేంద్రీకరించగా, చైనా, రష్యాలకు చెందిన వ్యాక్సిన్ కంపెనీలు ప్రపంచంలోని అన్ని దేశాలపై దష్టిని కేంద్రీకరించి, ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రష్యా నుంచి ఇప్పటికే అక్కడి మార్కెట్లోకి వచ్చిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు మన దేశానికి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన హెటరో డ్రగ్స్, స్పుత్నిక్ వీ తయారు చేస్తోన్న కంపెనీతో ముందస్తు ఒప్పందం చేసుకోవడమే అందుకు కారణం. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 92 శాతం పనిచేస్తోందని దాన్ని ఉత్పత్తి చేస్తోన్న కంపెనీ చెప్పుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment