Covid-19: Vaccine Protection Wanes Within 6 Months Finds A Study - Sakshi
Sakshi News home page

ఫైజర్, ఆస్ట్రాజెనెకా సామర్థ్యం ఆరునెలలే!

Published Thu, Aug 26 2021 6:30 AM | Last Updated on Thu, Aug 26 2021 4:56 PM

Protection From Pfizer, AstraZeneca Jabs Wanes Within 6 Months - Sakshi

లండన్‌: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్‌ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన జోయి కోవిడ్‌ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం  నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్‌ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. ‘‘మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్‌ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్‌ స్పెక్టర్‌ అన్నారు.  చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్‌

బూస్టర్‌ డోసులు అత్యవసరం  
కరోనా రెండు డోసుల వ్యాక్సిన్‌లతో పాటు కొంత విరామంలో బూస్టర్‌ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్‌ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  బూస్టర్‌ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్‌ స్పెక్టర్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement