six months
-
ఆరు నెలల బాలుడికి కిడ్నీలో రాళ్లు
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా చిన్నపిల్లలకు అవయవాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ ఆరు నెలల పిల్లలంటే అత్యంత సున్నితంగా ఉంటాయి. ఆ వయసులో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటిది రెండు కిడ్నీల్లోనూ రెండేసి రాళ్లు, అవీ పెద్ద పరిమాణంలో ఏర్పడటంతో ఓ బాబుకు మూత్రవిసర్జన ఆగిపోయి, పొట్ట ఉబ్బిపోయింది. ఆ బాబుకు ఎండోస్కోపిక్ విధానంలో మొత్తం నాలుగు రాళ్లను తొలగించి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్ వై.మనోజ్‌కుమార్ తెలిపారు. ‘నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన ఆరు నెలల బాబు దక్షిత్‌కు మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బిపోవడంతో ఈ నెల 5వ తేదీన కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనికి అన్ని పరీక్షలు నిర్వహించగా, రెండు కిడ్నీల్లో 11 మి.మీ, 9 మి.మీ, 9 మి.మీ, 7 మి.మీ. పరిమాణంలో నాలుగు రాళ్లు ఉన్నట్లు తేలింది. ముందుగా స్టెంట్లు అమర్చి కిడ్నీలను సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఎండోస్కోపిక్ విధానంలో కుట్లు లేకుండా లేజర్ ద్వారా ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా కిడ్నీలో రాళ్లను తొలగించాం. అతను కోలుకోవడంతో 10వ తేదీన డిశ్చార్జ్ చేశాం. ఇంత చిన్న వయసులో రెండు కిడ్నీల్లో రెండేసి రాళ్లు ఏర్పడటం ఏపీలో ఇదే తొలిసారి. లక్ష మందిలో కేవలం పది మందికే ఇలాంటి సమస్య తలెత్తుతుంది.’ అని డాక్టర్ వివరించారు. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ఆ దేశంలో ప్రతి ఆరు నెలలకూ ఎన్నికలు!
మనదేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఎన్నికలు ఆరునెలలకు ఒకసారి! ఏమిటా దేశం? ఎక్కడుంది? పనిలో పనిగా మొదటిసారి అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా తెలుసుకుందామా? ప్రతి ఆరునెలలకు ఎన్నికలు జరిగే దేశం యూరప్ ఖండంలో ఉంది. పేరు శాన్ మారినో. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం. జనాభా దాదాపు 34 వేలు. ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలు జరగడం.. ఫలితాలు వెలువడిన తరువాత అధ్యక్షుడు మారడం ఇక్కడ సర్వసాధారణం. ఎన్నికైన దేశాధినేతను ఆ దేశ ప్రజలు కెప్టెన్-రీజెంట్ అని పిలుస్తారు. గ్రేట్, జనరల్ కౌన్సిల్‌లోని 60 మంది సభ్యులు కెప్టెన్ రీజెంట్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడి పార్లమెంటును ఆరంగో అంటారు. శాన్ మారినోలో మొట్టమొదటి ఎన్నికలు క్రీస్తు శకం 1243లో జరిగాయి. ఈ దేశ రాజ్యాంగం 1600 నుంచి అమల్లోకి వచ్చింది. దేశం మొత్తం విస్తీర్ణం కేవలం 61 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది ఇటలీ పొరుగు దేశం. ఇటలీ సంస్కృతి, భాష ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి? -
వినియోగ ఉత్పత్తులకు మంచి డిమాండ్
హైదరాబాద్: సాంకేతిక వినియోగ వస్తువుల రంగం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదు చేసినట్టు జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లతో కూడిన టెలికం ఉత్పత్తుల విభాగంలో అమ్మకాల పరిమాణం 4 శాతం తగ్గింది. విలువ పరంగా 12 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో, 2022లోని ఇదే కాలంతో పోలిస్తే కొన్ని రంగాలు గణనీయమైన వృద్ధిని చూశాయి. ‘‘భారత కన్జ్యూమర్ మార్కెట్ మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిణామ క్రమంలో ఉంది. మార్కెట్లో వినూత్నమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొంది. టెక్నికల్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ పరంగా 8 శాతం చక్కని వృద్ధిని ప్రదర్శించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ రంగం (ఆడియో, వీడియో) 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది’’అని జీఎఫ్కే మార్కెట్ నిపుణురాలు సౌమ్య ఛటర్జీ తెలిపారు. జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్‌లైన్ రిటైల్ ట్రాకింగ్ నివేదిక ప్రకారం.. ► స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లు మంచి పనితీరు చూపించాయి. విలువ పరంగా 12 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ విభాగం విలువ పరంగా 14 శాతం, పరిణామం పరంగా 3 శాతం వృద్దిని నమోదు చేసింది. ముఖ్యంగా రూ.30,000కు పైన ఉన్న స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 50 వృద్ధి కనిపించింది. ► ప్రధాన గృహోపకరణాల విభాగం ఆశాజనకమైన పనితీరు చూపించింది. ఎయిర్ కండీషనర్లలో 7 శాతం వృద్ధి కనిపించింది. వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 6 శాతం పెరిగాయి. మైక్రోవేవ్ ఓవెన్లు 4 శాతం అమ్మకాల వృద్ధిని చూశాయి. ► మంచి వినోద అనుభవాన్ని భారత వినియోగదారులు కోరుకుంటున్నారు. దీంతో ఆడియో హోమ్ సిస్టమ్‌ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. పీటీవీ/ఫ్లాట్ టెలివిజన్ల అమ్మకాలు 13 శాతం అధికంగా నమోదయ్యాయి. ► ఐటీ రంగంలో డెస్‌్కటాప్ కంప్యూటర్ల అమ్మకాలు 7 శాతం పెరిగాయి. మొబైల్ పీసీ విక్రయాలు 14 శాతం తగ్గాయి. ► రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 29 శాతం పెరిగాయి. -
వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట
న్యూఢిల్లీ: వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ ఈడీ బీవీ మెహతా తెలిపారు. -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా సామర్థ్యం ఆరునెలలే!
లండన్: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన జోయి కోవిడ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. ‘‘మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ అన్నారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ బూస్టర్ డోసులు అత్యవసరం కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లతో పాటు కొంత విరామంలో బూస్టర్ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్ స్పెక్టర్ అన్నారు. -
కొలువులు కదల్లే..6 నెలల క్రితమే సర్కారు కసరత్తు
ఉద్యోగాల భర్తీపై ప్రకటనతో.. ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారు..’.. గత ఏడాది డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కరోనా ఎఫెక్ట్, కొత్త జిల్లాల సమస్యతో.. పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికారులు కసరత్తు మొదలుపెట్టినా.. కరోనా రెండో వేవ్‌తో సమస్య మొదలైంది. మరో రెండు కొత్త జిల్లాలతో తలెత్తిన జోనల్ సమస్య, ఉద్యోగుల పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులతో ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఆరు నెలలు గడిచినా.. సీఎం ప్రకటన చేసి ఇప్పటికి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రక్రియ పునఃప్రారంభమెప్పుడు? జోనల్ సమస్య తీరింది. కరోనా రెండో వేవ్ నియంత్రణలోకి వస్తోంది. పోస్టుల భర్తీ ప్రక్రియ పునఃప్రారంభం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరు నెలల కింద ప్రకటించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ముందుగా అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, తద్వారా కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కింది స్థాయిలో అప్పటికే ఉన్న ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీ పోస్టుల గుర్తింపుపై అన్ని ప్రభుత్వ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి. దాదాపు మూడు వారాల పాటు సీరియస్‌గా ప్రక్రియ కొనసాగింది. పురోగతిని సమీక్షించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రోజువారీ సమావేశాలు కూడా నిర్వహించారు. వివిధ శాఖల్లోని దాదాపు 18 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొందరు ఉద్యోగులకు పదోన్నతుల విషయంగా న్యాయపరమైన సమస్యలు, పలు ఇతర చిక్కులు తలెత్తడంతో జాప్యం జరిగింది. అప్పటికీ చాలా శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆర్థిక శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయింది. అప్పటికే కరోనా రెండో వేవ్ విజృంభణతో పోస్టుల భర్తీ కసరత్తు నిలిచిపోయింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో.. కరోనా ఎఫెక్ట్‌కు తోడు.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మరో సమస్య కూడా తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్‌లో గెజిట్ జారీ చేసింది. ఈ కొత్త విధానంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీజోన్ల ప్రాతిపదికన మళ్లీ పోస్టుల విభజన ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పూర్తికావాలంటే కనీసం రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. రెండు మూడు నెలల్లో, మొత్తంగా ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షల మంది నిరుద్యోగులు పరీక్షల ప్రిపరేషన్లో మునిగిపోయారు. జాప్యం జరిగిన కొద్దీ వయసు పెరిగి.. ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి దాదాపు రెండు నెలల సమయం పట్టొచ్చు. ఈ మధ్య దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు కల్పించాం. అలా ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. వాటిని కూడా కలిపి, పూర్తి డేటా సిద్ధంకాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుని, ఒకేసారి 50 వేల కొలువుల భర్తీ చేపడతాం. - సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1.91 లక్షల పోస్టులు ఖాళీనే.. రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారు. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరారు. ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. శుక్రవారం ధర్నాలు కొనసాగుతాయి’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు. -
బ్యాంకింగ్ మోసాలు రూ.95,760 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే, ఈ మోసాల విలువ 95,760.49 కోట్లు’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు సమగ్ర చర్యలను చేపట్టినట్లు, నిర్వహణలో లేని కంపెనీలకు సంబంధించి 3.38 లక్షల బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించారు. పీఎంసీ డిపాజిట్లలో 78% మందికి ఊరట పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల విషయంలో ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదు ఉపసంహరణ పరిమితిని రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీనితో డిపాజిటర్లలో 78% మందికి తమ అకౌంట్ల పూర్తి బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఆటో రంగం పుంజుకుంటుంది... వాహన రంగంలో మందగమనం సైక్లికల్ (ఎగుడు–దిగుడు) అని భారీ పరిశ్రమలు, ప్రభు త్వ రంగ సంస్థల వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ రంగానికి మద్దతిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోందని తెలిపారు. ఈ రంగానికి రుణ లభ్యతకుగాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. -
కశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పాడిగించేం దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్‌సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివర్లో కశ్మీర్లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసం (మే 7–జూన్4)లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా, జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్నాథ్ యాత్ర సాగుతోం దని తెలిపారు. రాష్ట్రంలో 2018 డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా.. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2030 కల్లా దేశంలోని ప్రజలందరికీ సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యాన్ని 2024 సంవత్సరానికి కుదించినట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడే ఈ చర్య తీసుకున్నామ న్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల్లో వృథా జలాన్ని శుద్ధిచేసి వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నీటి కొరతను నివారించే విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
ఆర్నెల్ల తర్వాత శవానికి పోస్టుమార్టం
కురబలకోట : ఆరు నెలల క్రితం మృతిచెందిన అంగళ్లుకు చెందిన శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇన్చార్జి రూరల్ సీఐ సురేష్‌కుమార్ వెల్లడించారు. ఆర్నెళ్ల తర్వాత కూడా మృత దేహం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. వివరాల్లోకెళితే.. అంగళ్లుకు చెందిన సీతారాంరెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందారు. ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు. పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. -
పెళ్లయిన ఆరు నెలలకే..
నిజామాబాద్: పెళ్లయిన ఆరు నెలలకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మూడో టౌన్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన రాజేశ్వరికి మహారాష్ట్రకు చెందిన మహేందర్ (25)తో ఆరు నెలల కింద వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం హమల్‌వాడి సాయిబాబా ఆలయం సమీపంలో అద్దెకు ఉంటున్నారు. వివాహమైన కొద్ది రోజుల నుంచే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పది రోజుల కింద భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మహేందర్ బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గది నుంచి పొగలు రావడం గమనించిన ఇంటి యజమాని అక్కడకు వెళ్లి చూడగా మహేందర్ మంటల్లో కాలిపోతూ కనిపించాడు. అతడ్ని కాపాడే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందాడు. మహేందర్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితురాలికి జైలు శిక్ష
రంగారెడ్డి: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితురాలకి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.7లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మెజిస్టేట్ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తె హరిపురి కాలనీకి చెందిన సుజాత, చాణుక్యపురికి చెందిన భాగ్యలక్ష్మీ పరిచయస్తులు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం భాగ్యలక్ష్మీ 2014 సంవత్పరంలో రూ.7లక్షల రూపాలయను సుజాత నుంచి అప్పుగా తీసుకని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించమని కోరగా అందుకుగాను కరూర్వైశ్యా బ్యాంకు ఎల్బీనగర్ బ్రాంచికి చెందిన రూ.6లక్షల చెక్కును సుజాత పేరిట జారీచేసింది. సదరు చెక్కును ఐసీఐసీఐ బ్యాంకు చైతన్యపురి బ్రాంచిలో జమచేయగా బాగ్యలక్ష్మీ ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు.దీంతో సుజాత నోటీసు పంపిన్పటికి భాగ్యలక్ష్మీ డబ్బు చెల్లించకపోవడంతో సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మెజిస్టేట్ పై విధంగా తీర్పు చెప్పారు. -
అమ్మ అస్థిపంజరంతో ఆరునెలలు...
షాగంజ్: ఉత్తర ప్రదేశ్‌లో తల్లి అస్థిపంజరంతో ఆరు నెలలుగా ఉంటున్న ఓ మహిళను షాగంజ్ పోలీసులు గుర్తించారు. అర్జున్ నగర్లో బీనా అనే మహిళ తన తల్లి శవంతో ఆరునెలలుగా ఇంట్లో ఉంటోంది. రెండు రోజలుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి అస్థిపంజరాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. బీనా (45) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, ఆమె తల్లి ప్రభుత్వ రిటైర్డు నర్సు. బీనా తల్లికి వచ్చే పింఛనుతోనే కుటుంబం నడిచేదని స్థానికులు తెలిపారు. బీనా మానసిక పరిస్థితి బాగాలేదని సమాచారం. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక బీనా తల్లి మరణానికి కారణాలు తెలుస్తాయని ఫోరెన్సిక్ నిపుణుడు అజయ్ అగర్వాల్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు నెలల ఆర్టీసీ నష్టం రూ.46 కోట్లు
కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ కర్నూలు రీజియన్‌కు గత ఆరు నెలల్లో రూ. 46కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రీజినల్ మేనేజర్ గిడుగు వెంకటేశ్వర రావు వెల్లడించారు. శనివారం స్థానిక జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ ప్రజా రవాణా సంస్థకు అనుకోని ఎదురుదెబ్బలు పడుతూనే ఉన్నాయని, ఈ కారణంగా నష్టాల్లోకి కూరుకుపోతోందని చెప్పారు. వార్షిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సంస్థకు రూ.46కోట్ల మేరకు నష్టం వచ్చిందని, ఇందులో ఎమ్మిగనూరు, ఆత్మకూరు డిపోలో రూ. 5కోట్ల చొప్పున నష్టాల్లో మొదటి స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. బనగానపల్లె, డోన్ డిపోలు రూ.4కోట్లతో రెండో స్థానంలో, ఆళ్లగడ్డ రూ.3కోట్లు, కర్నూలు–1, 2డిపోలో రూ. 2కోట్ల నష్టాల్లో ఉన్నాయని వెల్లడించారు. సంస్థను ముందుకు నడిపించేందుకు సగటున నెలకు రూ.7.50 కోట్ల వరకు అప్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈనష్టాలను నివారించేందుకు చర్యలు చేపట్టామని, రెండు మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోనున్నట్లు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన పార్సిల్, లగేజీ విధానంతోపాటు సూపర్ లగ్జరీ (హైటెక్) బస్సు డిక్కీలను నెలవారి అద్దె ప్రతిపాదికన బాడుగకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వాణిజ్య, వ్యాపారస్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
2005 క్రితం కరెన్సీ నోట్ల మార్పునకు గడువు పొడిగింపు
ముంబై: 2005 క్రితం నాటి రూ.500, రూ.1,000సహా పలు డినామినేషన్లలోని కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది. ఈ ఏడాది చివరి వరకూ ఉన్న గడువును మరో ఆరు నెలలు 2016 జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కేవలం గుర్తింపు పొందిన బ్యాంక్ బ్రాంచీలు, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో మాత్రమే బ్యాంక్ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జనవరితో ముగిసిన 13 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో 164 కోట్లకుపైగా 2005 క్రితం నోట్లను వ్యవస్థ నుంచి (చించివేత యంత్రం ద్వారా) తొలగించినట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.21,750 కోట్లు. -
ఆరు నెలలుగా జీతాల్లేవు..!
ఆందోళన చెందుతున్న ఎంటీఎస్ తమ చేతిలో లేదంటున్న అధికారులు పట్టించుకోని ప్రభుత్వం శ్రీకాకుళం న్యూకాలనీ: ఎంటీఎస్(మినిమమ్ టైమ్ స్కేల్) ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతం పడకపోతే నానా హైరానా పడతారని, అలాంటిది ఆరునెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారని కాం ట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో నిరుద్యోగులు వందల సంఖ్యలో కాంట్రాక్టు బేసిక్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి డిసెండర్ నుం చి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. అంతకు ముందు ట్రెజరీల్లో 01 పేరిట ప్రభుత్వం జీతాలను చెల్లిస్తూ వచ్చింది. అయితే, వీరిని తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో 022 పద్దు కింద జీతాలు చెల్లించాల్సి ఉంది. అందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సంబంధిత శాఖల కమీషనర్ల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుండడం తో చిరు ఉద్యోగులు కుటుంబపోషణకు సతమతమవుతున్నారు. అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఇంటర్మీడియెట్ విద్య వృత్తివిద్యాధికారి పాత్రుని పాపారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఎంటీఎస్ ఉద్యోగులకు జీతాలు రాని మాట వాస్తవమేనని అంగీకరించారు. వారి జీతాలకు సంబంధించిన పద్దు మారిందని, అది తమ చేతిలో లేద న్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉందన్నారు. -
ఆర్నెల్లు.. చేసింది నిల్
ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలు సీఎం అయ్యాక మరికొన్ని వరాలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చిన బాబు నెల్లూరు (అర్బన్): ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆర్నెల్ల కాలంలో జిల్లాకు ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. కేవలం ప్రచారానికే ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాలుగు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లోనూ అనేక హామీలను గుప్పించారు. వాటిలోనూ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. వచ్చిన ప్రతిసారీ కోస్తా కారిడార్‌లో భాగంగా జిల్లాను పారిశ్రామిక హబ్, పర్యాటక హబ్ చేస్తాం, నెల్లూరుకు భూగర్భ డ్రైనేజీ, ఫిషింగ్ హార్బర్, నెల్లూరుకు విమానాశ్రయం.... ఇలా హామీల మీద హామీలను గుప్పించారు. అయితే ఇప్పటివరకు వీటి కోసం జిల్లాకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఎన్నికలకు ముందు.. ఎన్నికలకు ముందు మార్చి 5న చంద్రబాబు జిల్లాకు వచ్చారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాగర్జనలో అనేక హామీలు ఇచ్చారు. నెల్లూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా నెల్లూరును పారిశ్రామిక నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఒకటి, రెండుచోట్ల రింగురోడ్డును ఏర్పాటు చేయిస్తామని, మత్స్యకార హార్బర్‌ను నిర్మిస్తామని చెప్పారు. పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాలువను అభివృద్ధి చేస్తామని, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇంకా ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్టైల్ పార్క్, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు స్థాపిస్తానని ఆర్భాటంగా సభలో చెప్పారు. ఎన్నికలు జరిగాక మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో నాలుగుసార్లు బాబు జిల్లాకు వచ్చారు. జూన్ 6న షార్‌లో జరిగిన కార్యక్రమం కోసం, జులై 19న నెల్లూరులోని వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి, ఆగస్టు 24న స్వర్ణభారత్‌లో జరిగిన కార్యక్రమం కోసం, అక్టోబర్ 10న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ వల్లిస్తూ వచ్చారు గానీ చేసిందేమీ లేదు. సీఎంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు జూలై 19న: వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన బాబు ఈ సమయంలోనే అధికంగా హామీలు గుప్పించారు. సోమశిల ఎత్తిపోతల పథకం, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒక కాలపరిమితి నిర్ణయించి ఐదేళ్లలో పూర్తిచేస్తామని, మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని, పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా రూపొందిస్తామని కేంద్రం ప్రకటించిన వంద స్మార్ట్‌సిటీల్లో నెల్లూరు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరుకు విమానాశ్రయం సాధించాల్సి ఉందని తెలిపారు. నెల్లూరు నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుకు రాష్ట్రప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రే కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పులికాట్, నేలపట్టు, మైపాడ్, పెంచలకోనలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని, మైపాడుకు నాలుగు వరుసల రోడ్డు మంజూరుచేస్తున్నట్లు, నెల్లూరుకు రింగురోడ్డు కావాలని అడిగారని, అది కూడా మంజూరు చేస్తున్నామని సభలో ఘనంగా ప్రకటించారు. ఆగస్టు 24న ఇచ్చిన హామీలు: నేషనల్ గేమ్స్‌ను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒక ఈవెంట్‌ను నెల్లూరులో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. అక్టోబర్ 10న : కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెంలో, వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలిలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న బాబు జిల్లాను టూరిజం హబ్‌గా తయారుచేస్తానని, వెంకటగిరి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణం పూర్తిచేస్తానని, తెలుగుగంగ బ్రాంచి కాలువల నిర్మాణంపై దృష్టిపెడతానని, వెంకటగిరి ప్రాంత పొలాలకు కండలేరు జలాలు తెప్పిస్తానని, వెంకటగిరిలో విమానాశ్రయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. చేసింది శూన్యం.. బాబు ప్రటించిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సంగం బ్యారేజీ నుంచి తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి హడ్కో నుంచి రూ.1500 కోట్ల రుణం ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు హామీ ఇచ్చారు. ఆ నిధులు వచ్చేలా చూస్తానని బాబు కూడా మాట ఇచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా రెండు పథకాల కోసం ప్రతిపాదనలు పంపారు. అయితే ఆర్థిక శాఖ దానిని బుట్టదాఖలు చేసింది. ఒకసారి నెల్లూరులో విమానాశ్రయం అని చెప్పిన బాబు మరోసారి వెంకటగిరిలో విమానాశ్రయం అని ప్రకటన చేశారు. రెండుసార్లు రెండు ఊర్ల పేర్లు చెప్పడంతో జిల్లా ప్రజలు బాబు తీరును చూసి నవ్వుకున్నారు. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఐదు పథకాలను ప్రారంభించింది. ఇవి జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2 కు ఇరవై లీటర్ల మంచి నీళ్ల పథకాన్ని జిల్లాలో 420 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయించగా కేవలం 18 చోట్ల మాత్రమే ప్లాంట్లు మొదలుపెట్టారు. ఇవీ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. జిల్లాలో 50వేల మంది అర్హులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అదీ సక్రమంగా అమలు కావడంలేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అని చెప్పి.. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే హామీలు ఇచ్చి ఇప్పటివరకు జిల్లాకు పైసా కూడా ఇవ్వని బాబుపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ సంగతి సరేసరి రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన బాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ విషయంలో ఇరువర్గాలను మోసం చేశారు. రూ.50వేల లోపు తీసుకున్న రైతులకు మాత్రమే పూర్తి మాఫీ వర్తిస్తుందని, ఆ పైన లక్షన్నర లోపు తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిన చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో కేవలం 63 వేలమంది రైతులను మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. జిల్లాలో 35,335 డ్వాక్రా సంఘాలు రూ.592.28 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.300 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇంతవరకు డ్వాక్రా రుణాల ఊసెత్తకపోవడంతో తీసుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. -
13ఏళ్ల బాలికపై ఆరునెలలుగా అత్యాచారం