రంగారెడ్డి: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితురాలకి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.7లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మెజిస్టేట్ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తె హరిపురి కాలనీకి చెందిన సుజాత, చాణుక్యపురికి చెందిన భాగ్యలక్ష్మీ పరిచయస్తులు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం భాగ్యలక్ష్మీ 2014 సంవత్పరంలో రూ.7లక్షల రూపాలయను సుజాత నుంచి అప్పుగా తీసుకని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది.
గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించమని కోరగా అందుకుగాను కరూర్‌వైశ్యా బ్యాంకు ఎల్‌బీనగర్ బ్రాంచికి చెందిన రూ.6లక్షల చెక్కును సుజాత పేరిట జారీచేసింది. సదరు చెక్కును ఐసీఐసీఐ బ్యాంకు చైతన్యపురి బ్రాంచిలో జమచేయగా బాగ్యలక్ష్మీ ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు.దీంతో సుజాత నోటీసు పంపిన్పటికి భాగ్యలక్ష్మీ డబ్బు చెల్లించకపోవడంతో సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మెజిస్టేట్ పై విధంగా తీర్పు చెప్పారు.