సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారు. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరారు.
ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. శుక్రవారం ధర్నాలు కొనసాగుతాయి’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment