Oxford University scientists
-
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్‌ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
దిద్దుకోలేని దశకు వాతావరణం
ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల ముప్పునకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రకృతి ప్రకోపం అనండి లేదా ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. భూమ్మీదమనిషి మనుగడ క చ్చితంగా ప్రమాదంలో పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేసిన నివేదిక ప్రకారం పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఉన్న సమయం కూడామించిపోయింది. ఇకపై ఏం జరుగుతుందన్నది చెప్పడంతమ చేతుల్లోనూ లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 2023 డేనియల్ తుపాను లిబియాసహా ఆగ్నేయ యూరప్‌లోని కొన్నిప్రాంతాల్లో అకాల వరదలకుకారణమైంది. వేల మంది నిర్వాసితులయ్యారు. ఆస్తినష్టం రూ.16,658 కోట్ల పైమాటే! 2023 స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్ ‘ఎంటరింగ్ అన్చార్టడ్ టెరిటరీ’పేరుతో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రెస్ గత నెలలో ఓ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఇక తప్పించుకునే అవకాశం లేదు. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో మార్పులు వస్తాయని, అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతాయని, కార్చిచ్చులు దహించి వేస్తాయని, పంట దిగుబడులు తగ్గడంతోపాటు సముద్రమట్టాలు పెరిగిపోయి భూమ్మీద మనిషి బతకడం అసాధ్యంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం తదితర అనేక చర్యల ద్వారా ఈ మార్పులను అడ్డుకోవచ్చని, భూతాపోన్నతిని కట్టడి చేయొచ్చని నిన్న మొన్నటివరకూ అనుకునేవారు. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన ప్రకృతి వైపరీత్యాలను పరిశీలిస్తే.. అవేవీ సహజసిద్ధమైన వాతావరణ మార్పుల వల్ల వ చ్చినవి కావని, మానవ చర్యల పర్యవసానంగానే ఇవన్నీ జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ నివేదికను 2020లో రిపల్ అండ్ వూల్ఫ్లు మొదటిసారి సమర్పించినప్పటికీ తాజాగా 15,000 మంది శాస్త్రవేత్తలు ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రికార్డులు బద్ధలు 2023లో అసాధారణ ప్రకృతి వైపరీత్యాలు నమోదయ్యాయి. వాతావరణానికి సంబంధించి పలు రికార్డులు బద్ధలయ్యాయి. ప్రాంతాలకు అతీతంగా వడగాడ్పులు, రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఒక హెచ్చరికైతే.. సముద్ర ఉపరితల జలాల వేడి కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. అంటార్కిటికాలోనూ మునుపెన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జూలై మొదట్లో భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే జూన్–ఆగస్టు మధ్యమునుపటితో పోలిస్తే ఎక్కువ వేడి ఉన్నట్లు రికార్డు అయ్యింది. బహుశా ఇది లక్ష ఏళ్ల చరిత్ర కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని దశకు.. పారిశ్రామిక విప్లవ సమయానికి ముందునాటి ఉష్ణోగ్రతల కంటే భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత 2000 సంవత్సరం వరకూ ఏనాడూ 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ నమోదు కాలేదు. తరువాతి కాలంలోనూ అడపాదడపా ఈ స్థాయిని దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ.. 2023లో మాత్రం సెపె్టంబరు 12 నాటికే మొత్తం 38 రోజులు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఏడాది పూర్తయ్యే సరికి ఇది మరింత పెరుగుతుందని అంచనా. 2023 జూలై 7న అంటార్కిటిక్ సముద్రం పరిసరాల్లోని మంచు ప్రాంతం ఉపగ్రహ సమాచారం లభించడం మొదలైన తరువాత అతితక్కువ విస్తీర్ణంలో ఉన్నట్లు స్పష్టమైంది. 1991–2023 మధ్య మంచుప్రాంతం కంటే 26.7 లక్షల చదరపు కిలోమీటర్లు తక్కువ. మానవ చర్యల ఫలితమే... ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాలకు మానవ చర్యలే కారణమన్నది సుస్పష్టం. ఉదాహరణకు అట్లాంటిక్ మహా సముద్ర ఉపరితల జలాలు వేడెక్కేందుకు ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో రేగే దుమ్ము, కురిసే వర్షపాతానికి సంబంధం ఉండటం. ఇంకో ఆసక్తికరమైన అంశం.. నీటిలోపల ఉన్న అగ్నిపర్వతాల నుంచి కొన్ని కి.మీ. ఎత్తువరకూ ఎగజిమ్మే నీటి ఆవిరి (కర్బన ఉద్గారం మాదిరే ప్రమాదకరమైంది) మోతాదులో తేడా వ చ్చినా భూతాపోన్నతి సంభవిస్తుంది. ఏడాది కాలంగా ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కర్బన ఉద్గారాల నియంత్రణ చర్యల్లో భాగంగా సముద్రయానానికి గంధకం తక్కువగా ఉన్న ఇంధనాలను వాడటం తప్పనిసరి చేయడమూ కావచ్చు. ఇవేవీ కాదనుకున్నా ఈ ఏడాది ఎల్ నినో కారణంగానూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్–నినో, లా–నినా వంటి సహజ ప్రక్రియలు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఎక్కువవుతాయి. కిం కర్తవ్యం... పరిస్థితి చేయిదాటిపోతోంది.. మరి గట్టెక్కేందుకు ఏం చేయాలి? ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికాభివృద్ధి పేరుతో ఇప్పుడు మనం చేస్తున్న విచ్చలవిడి కార్యకలాపాలకు తక్షణం ఫుల్స్టాప్ పెట్టాలి. శిలాజ ఇంధనాలు, నేల వినియోగంలో మార్పుల వల్ల వెలువడుతున్న కర్బన ఉద్గారాల కట్టడికి శక్తులన్నీ కూడగట్టుకుని యత్నించాలి. కర్బన ఉద్గారాలను సహజసిద్ధంగా నిల్వ చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో వాతావరణంలోకి చేరిన అదనపు కార్బన్‌డయాక్సైడ్‌ను వేగంగా తొలగించేందుకు అన్ని రకాల వ్యూహాలను వాడుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో భూమి కొంచెం చల్లగా ఉంటుంది. వాతావరణంలోకి చేరుతున్న కార్బన్‌డయాక్సైడ్‌లో 80 శాతానికి కారణమవుతున్న బొగ్గు వాడకాన్ని వీలైనంత వేగంగా తగ్గించే ప్రయత్నం జరగాలి. ఈ శతాబ్దపు చివరి నాటికి 300 నుంచి 600 కోట్ల మంది ప్రజలు జీవించేందుకు అనువుగా లేని ప్రాంతాల్లో ఉంటారని అంచనా. ఇలాంటి మహా విపత్తుల పరిష్కార మార్గాలు కూడా అంతే పెద్దవిగా ఉండాలనడంలో సందేహం లేదు. అవీ.. ఇవీ.. ♦ కోవిడ్–19 సమయంలో కర్బన ఉద్గారాలు కొంతమేరకు తగ్గినప్పటికీ ఆ తరువాతి కాలంలో మునుపటి కంటే ఎక్కువయ్యాయి. ♦ సౌర, వపన విద్యుత్తుల వాడకం 2021–22 మధ్య 17 శాతం వరకూ పెరిగింది.. కానీ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఈ పెరుగుదల చాలాచాలా తక్కువ. ♦ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం యూరప్‌లో చౌక రష్యన్ సహజవాయువు నుంచి బొగ్గు వాడకం వైపు మళ్లించింది. ఫలితంగా ఇప్పటికే శిలాజ ఇంధనాలపై ఇచ్చే సబ్సిడీ విలువ 53,100 కోట్ల డాలర్ల (2021) నుంచి 1,09,700 కోట్ల డాలర్లు (2022)కు పెరిగిపోయింది. ♦ 2021–22 మధ్య భూమ్మీద చెట్లు వ్యాపించి ఉన్న విస్తీర్ణం ఏకంగా 9.7 శాతం తగ్గిపోయి 2.28 కోట్ల హెక్టార్లకు పరిమితమైంది. ♦ కెనడాలో మునుపెన్నడూ లే¯స్థాయి లో అడవులు కార్చిచ్చులకు బలవుతున్నాయి. ఈ ఏడాది కోటీ 66 లక్షల హెక్టార్లలో అడవులు బూడిదయ్యాయి. ♦ వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ల మోతాదు కూడా బాగా ఎక్కువైంది. కార్బన్డయాక్సైడ్ ప్రతి పది లక్షల భాగాలకు 420 భాగాల స్థాయికి చేరింది. ♦ సముద్రాల ఆమ్లత, హిమానీనదాల మందం, గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు.. అన్నీ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో సముద్రమట్టం, ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జూలై–ఆగస్టు 2023 చైనా బీజింగ్‌లో 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షం. 12.9 లక్షల మందిపై ప్రభావం... 1,47,000 ఇళ్లు ధ్వంసం... 33 మంది మృతి! భారత్.. రుతుపవనాల వర్షాలు కాస్తా ఆకస్మిక వరదలుగా మారిపోయాయి. ఉత్తర భారతంలో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. వంద మందికిపైగా చనిపోయారు. అమెరికాలో... హవాయి ప్రాంతంలోని మావుయిద్వీపంలో కార్చిచ్చు ప్రబలి 111 మందిమృత్యువాత పడ్డారు. -(కంచర్ల యాదగిరిరెడ్డి) -
కరోనా సోకిన రెండేళ్ల వరకు మానసిక సమస్యలు
లండన్: కోవిడ్ రోగుల్లో రెండేళ్ల తర్వాత కూడా మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ 12.5 లక్షల మంది కరోనా రోగులపై నిర్వహించిన అధ్యయనం వివరాలను లాన్సెట్ సైక్రియాట్రి జనరల్ తన తాజా సంచికలో ప్రచురించింది. కరోనా సోకినప్పుడు శ్వాసకోశ సంబంధింత వ్యాధులతో పాటుగా రెండేళ్ల వరకు సైకోసిస్, డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్ వంటి కొనసాగుతున్నాయని అధ్యయనం తేల్చింది. చిన్నారుల్లో కంటే పెద్దవారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు పేర్కొంది. మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు కోవిడ్ సోకిన మొదటి ఆరు నెలల్లోనే వచ్చి రెండేళ్ల వరకు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ పాల్ హరిసన్ వివరించారు. -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా సామర్థ్యం ఆరునెలలే!
లండన్: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన జోయి కోవిడ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. ‘‘మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ అన్నారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ బూస్టర్ డోసులు అత్యవసరం కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లతో పాటు కొంత విరామంలో బూస్టర్ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్ స్పెక్టర్ అన్నారు. -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ : కొత్త ఏడాది వస్తూ వస్తూ శుభవార్తని మోసుకొచ్చింది. కరోనాని కట్టడి చేయడానికి మనకూ ఓ వ్యాక్సిన్ వచ్చేసింది. కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ (సీడీఎస్సీఓ) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. నేడు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్‌కి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (సీఎస్‌వో) వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులివ్వడానికి సిఫారసు చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆరో తేదీ నుంచి వ్యాక్సినేషన్ ..? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. శుక్రవారం జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ వ్యాక్సిన్ల సంపూర్ణ సమాచారాన్ని అందించారు. అన్నింటినీ సమీక్షించిన అనంతరం నిపుణుల కమిటీ మాత్రం తొలుత ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగానికే సిఫారసు చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌లో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 6 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్, అర్జెంటీనా తర్వాత అనుమతులు ఇచ్చిన మూడో దేశంగా భారత్ నిలుస్తోంది. రష్యా, బ్రిటన్, అమెరికా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదలైంది. ఫైజర్ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్ జెనీవా: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. డబ్ల్యూహెచ్‌వో గురువారం ఫైజర్ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అన్ని దేశాలు వారి పరిధిలో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులివ్వడం, టీకా డోసుల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పింది. ఫైజర్ టీకా నాణ్యత, భద్రత అంశంలో ప్రమాణాలకు లోబడి ఉందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉండడంతో అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఎంతవరకు వినియోగిస్తారన్నది సందేహమే. ఈ విషయాన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్ఒ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంలో ఎదురయ్యే సవాళ్లను ఇతర దేశాలు ఎంతవరకు ఎదుర్కోగలవో చెప్పాలని పేర్కొంది. నేడు అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్.. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ 2న అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చెక్‌లిస్టులు, ఎస్ఓపీలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 20 వేల కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 20,035 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,86,709కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 256 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,994 కు చేరుకుందని తెలిపింది. యూకేకు చెందిన కొత్త కరోనా స్ట్రెయిన్ మరో నలుగురికి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొత్త స్ట్రెయిన్ కలిగిన మొత్తం వ్యక్తుల సంఖ్య 29కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98,83,461కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.08 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,54,254గా ఉంది. ► ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ► మొదటి టీకా డోసు ఇచ్చిన నాలుగు నుంచి పన్నెండు వారాల్లోగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ► ధర విషయంలోనూ ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంది. ఒక్కో డోసు ధర 3 అమెరికా డాలర్లుగా నిర్ణయిం చారు. రెండు డోసులకి 6 డాలర్లు అంటే రూ. 440 అవుతుంది. అయితే ప్రైవేటు మార్కెట్లో రెండు డోసులకి రూ.700–800 వరకు వెచ్చించాల్సి ఉంటుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా చెప్పారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 5 కోట్ల టీకా డోసుల్ని సిద్ధంగా ఉంచింది. వాటినన్నింటినీ భారత్‌లోనే వినియోగించనున్నారు. మార్చి నాటికల్లా 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. ► ఈ నెల 6 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ శనివారం నుంచే టీకా డోసుల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ► టీకా సామర్థ్యం అంశంలో ఫైజర్ మోడెర్నా కంటే కోవిషీల్డ్ వెనుకబడి ఉంది. ఫైజర్ టీకా 95% సామర్థ్యంతో పని చేస్తే ఈ వ్యాక్సిన్ 70.4% సామర్థ్యంతో పని చేస్తోంది. -
కరోనాను నిరోధిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా!
లండన్: కరోనాను అడ్డుకోవడంలో ఆక్స్ఫర్డ్ రూపొందించిన టీకా (ChAdOx1 nCoV&19) మంచి సత్ఫలితాలు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫేజ్3లో ఈ టీకా కోవిడ్ నిరోధకతలో మంచి ఫలితాలు చూపిందని, అత్యున్నత రక్షణను ఇస్తోందని తెలిపాయి. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ రూపొందిస్తున్న ఈ టీకాను ఫేజ్ 3 ప్రయోగాల్లో రెండు బ్యాచ్‌లకు ఇచ్చారు. తొలి బ్యాచ్‌లో టీకా 90 శాతం, రెండో బ్యాచ్‌లో 62 శాతం ప్రభావం చూపింది, సగటున వ్యాక్సిన్ 70.4 శాతం ప్రభావం చూపినట్లయింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గినట్లు గమనించారు. ‘‘ట్రయిల్స్ కోసం బ్రిటన్, బ్రెజిల్ నుంచి 20వేల మంది వాలంటీర్లను తీసుకున్నారు. వ్యాక్సిన్‌ను రెండు దశల్లో హై డోసుల్లో ఇచ్చినప్పుడు 62 శాతం ప్రభావమే కనిపించగా, తొలుత తక్కువ డోసు ఇచ్చి అనంతరం రెండోదఫా అధికడోసు ఇచ్చిన కేసుల్లో 90 శాతం ప్రభావం కనిపించిందని, ఎందుకు ఈ తేడా వచ్చిందో ఇంకా తెలియరాలేదని సంస్థ ప్రతినిధులు వివరించారు. తాజా ఫలితాలు కరోనాపై టీకాకు మరింత దగ్గరకు చేర్చాయని ఆక్స్ఫర్డ్ ప్రొఫిసర్ సారా గిల్బర్ట్ చెప్పారు. ఎప్పటికప్పుడు ఫలితాలను నియంత్రణా సంస్థలకు అందిస్తామన్నారు. టీకాపై ఇండియా తదితర దేశాల్లో ఇంకా ట్రయిల్స్ జరుపుతూనే ఉన్నారు. ఏడాది చివరకు దాదాపు 60 వేల మందిపై టీకా ప్రయోగించాలని భావిస్తున్న ట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. సాధారణ జలుబును కలిగించే వైరస్‌ను బలహీన పరిరచి దాన్ని జన్యుపరంగా మార్చి కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. -
26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి
లండన్: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం. ఇన్నాళ్లూ ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అనుకుంటూ వచ్చాం. కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్–19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది. అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్ఫార్డ్ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వెల్లడైంది. తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మహిళల్లో ముప్పు తక్కువకి కారణమిదే ! ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 గణాంకాల ను పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషులకే వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు అన్వేషించారు. వారి పరిశోధనల్లో మహిళల్లో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ వల్ల వైరస్ సోకే ముప్పు తక్కువగా ఉందని తేలింది. కరోనా వైరస్ సోకితే గుండె మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. అదే విధంగా కరోనా వైరస్ ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్ అడ్డుపడు తుందని, దీం తో వైరస్ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ లియాన్నె గ్రోబన్ చెప్పారు. తాము చేసిన అధ్యయనం కోవిడ్ చికిత్సకి పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. -
అక్టోబర్‌లో ఆక్స్ఫర్డ్ టీకా!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ నివారణకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన టీకా అభివృద్ధి కార్యక్రమం కీలకమైన ముందడుగు వేసింది. చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు ప్రోత్సాహకరమైన ఫలితాలివ్వగా మానవ ప్రయోగాలు వేగంగా నిర్వహిస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త, జెనెన్‌ర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. టీకా అక్టోబర్‌కల్లా సిద్ధమయ్యే అవకాశముందన్నారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్‌లోని కొంతమంది కార్యకర్తలపై ప్రయోగించారు. టీకా అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 సంస్థలు/ పరిశోధన కేంద్రాలు టీకాలు అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉండగా, వీటన్నింటి లోనూ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ టీకా మేలైన ఫలితాలు ఇస్తు న్నట్లు తెలుస్తోంది. (లాక్డౌన్లో ఎంత డౌన్) ఈ కార ణంగానే ఈ టీకా ఇప్పటికే మానవ ప్రయోగాల తుదిదశ కు చేరుకుందని అంచనా. దక్షిణాఫ్రికాలోనూ ఈ టీకాను సుమారు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. బ్రిటన్‌లో సుమారు 4000 మంది ఇప్పటికే టీకా ప్రయోగాలకు తమ సమ్మతిని తెలిపారని, మరో పదివేల మందిని సమీప భవిష్యత్తులో నియమించుకుంటామని కంపెనీ చెబుతోంది. ఏప్రిల్ 23న ఈ మానవ ప్రయోగాలు మొదలయ్యాయని సమాచారం. వీటి వివరాలు ఆగస్టు లేదా సెప్టెంబరు నెలకు అందుతాయని, తదనుగుణంగా అక్టోబరులో టీకాను విడుదల చేస్తామని అడ్రియన్ హిల్ ఇటీవల జరిగిన ఒక వెబినార్‌లో వ్యాఖ్యానించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆస్ట్రా జెనెకా 3కోట్ల టీకా డోసులను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ టీకాను స్థానికంగా తయారు చేసేందుకు ఆస్ట్రా జెనెకాతో ఒక ఒప్పందం చేసుకుంటున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్యురాడో పాజిల్లో తెలిపారు. (భారీగా తగ్గిన పీపీఈ కిట్ల ధరలు) -
విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా
లండన్: కరోనా వైరస్‌పై పోరులో లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన ముందడుగు వేసింది. వైరస్‌ను నివారించే టీకాను పదివేల మందిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఈ టీకా కరోనా శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుందా? లేదా? అన్నది పరిశీలించనుంది. గత నెలలో వెయ్యిమందిపై జరిగిన ప్రయోగాలు టీకా సురక్షితమైందని స్పష్టం చేయగా.. దాని సమర్థతను పరీక్షించేందుకు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వృద్ధులతో కలిపి 10,260 మందికి టీకా వేయనున్నామని శుక్రవారం ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనా, అమెరికా, యూరప్‌లలో 12 వరకూ టీకాలు వేర్వేరు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇంత వేగంగా ఓ వ్యాక్సీన్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఈ టీకాలు అన్ని ప్రయోగ దశలు దాటుకుని సురక్షితంగా, సమర్థంగా వైరస్‌ను అడ్డుకుంటాయా అన్నది ఇప్పటికీ అస్పష్టమే. ప్రయోగాత్మక టీకాల్లో అధికం రోగ నిరోధక శక్తిని చైతన్యవంతం చేసి వైరస్‌ను గుర్తించి మట్టుబెట్టేలా చేసేవే. ఆక్స్ఫర్డ్ టీకానే తీసుకుంటే ఇది నిరపాయకరమైన వైరస్‌తో తయారవుతోంది. చింపాంజీలకు జలుబు తెప్పించే వైరస్. ఇందులో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇది వ్యాప్తి చెందదు. -
సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు ఫలించి, కరోనా వైరస్‌కు టీకా అందుబాటులోకి వస్తే.. ఈ సెప్టెంబర్ నాటికి 3 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను సిద్ధం చేయాలని బ్రిటన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో, ఇంపీరియల్ కాలేజ్‌లో ఈ టీకాకు సంబంధించిన పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రి అలోక్ శర్మ తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌లో హ్యూమన్ ట్రయల్స్ స్థాయికి పరిశోధనలు చేరుకున్నాయన్నారు. అయితే, పూర్తి స్థాయిలో విజయవంతమయ్యే టీకాను రూపొందించడం సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీకా రూపకల్పనకు కృషి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, పరిశోధకులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఇప్పటికే ఏర్పాటుచేశామన్నారు. వం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది. -
కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే
లండన్: కోవిడ్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచదేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి యూకేలో ఆక్సఫర్డ్ వర్సిటీ పరిశోధన మీదే ఉంది. మందుల తయారీ కంపెనీ అస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జెన్నర్ ఇనిస్టిట్యూట్ రూపొందిస్తున్న ChAdOx1 nCoV-19 అనే ఈ వ్యాక్సిన్ కోతులపై సానుకూల ఫలితమివ్వడం తెల్సిందే. వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలన్నింటికీ అందుబాటులోకి తెస్తామని పరిశోధనల్లో పాల్గొంటున్న ఆక్స్ఫర్డ్ జెన్నర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అడ్రియాన్ హిల్ చెప్పారు. మనుషులపై ప్రయోగాలు సక్సెస్ అయితే వ్యాక్సిన్ ధర ఎంతవరకు ఉంటుందన్న సందేహాలను ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్ నివృత్తి చేశారు. అతి తక్కువ ధరలో అత్యధికులకి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని వెల్లడించారు. ‘ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా వివిధ ప్రాంతాల్లో ల్యాబ్‌లలో దీన్ని రూపొందిస్తాం’ అని హిల్ చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్ ఉండడం కోసం ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏడు ఇనిస్టిట్యూట్లలో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భారత్‌లోని పుణేలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ఉంది. యూరప్, చైనాలో వివిధ ఇనిస్టిట్యూట్లలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తారు. జూలై, ఆగస్టునాటికల్లా మానవులపై ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తేలిపోతుందని హిల్ వివరించారు. జాగిలాలు కరోనా జాడ పడతాయా? కరోనా వైరస్ లక్షణాలు మనిషిలో బయటపడక ముందే ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన కోవిడ్ జాగిలాలు వారిని గుర్తించగలవేమోనన్న దిశగా యూకే ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించింది. కోవిడ్ రోగి నుంచి శాంపిల్స్, కోవిడ్ లేని వారి నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని ఆ జాగిలాల దగ్గర ఉంచి వాసన ద్వారా పసిగట్టేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. -
కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం
లండన్: కరోనా వైరస్‌పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధనలో భాగంగా ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్‌ను ఆరు కరోనా బాధిత కోతులకు ఇచ్చారు. దీంతో ఆ కోతుల్లోని రోగ నిరోధక శక్తి కరోనాను అడ్డుకున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో దుష్ప్రభావాలు ఏవీ కనిపించలేదు. కరోనా వల్ల ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కానీ, ఈ వ్యాక్సిన్ డోసు ఇచ్చిన కరోనా బాధిత కోతుల్లో ఊపిరితిత్తులకు ఎలాంటి హానీ జరగలేదు. ఇతర అవయవాలపైనా వైరస్ తీవ్రతను వ్యాక్సిన్ తగ్గించింది. కోతుల్లో జరిగిన పరిశోధన సానుకూల ఫలితాన్ని ఇవ్వడంతో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తయారీకి ఊతం లభించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ మనుషుల్లో కూడా కరోనాను నిర్మూలిస్తుందని తేలితే ఈ ఏడాది చివరి కల్లా 10 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఔషధ తయారీ సంస్థ అస్ట్రాజెనికా వెల్లడించింది. -
ఈ ఏడాది చివరికల్లా టీకా!
వాషింగ్టన్: కోవిడ్ టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ నిర్వహించిన టౌన్‌హాల్ కార్యక్రమంలో ఆయన చానల్ సోషల్ మీడియా ద్వారా అందిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే అనుకుంటున్నానని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు టీకా తయారీకి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రకటించినప్పటికీ గత నెలలో వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ టీకా త్వరగా అందుబాటులోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. 12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిల్లో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీల్లో కనీసం పన్నెండు టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయి. ‘శాస్త్రవేత్తల బృందాలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు పోటీపడుతున్నాం. ఈ క్రమంలో మరింత మంది ప్రయోగాలు చేయడం అవసరం కూడా’’అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టీకా తయారీకి జరుగుతున్నప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆండ్రూ పోలార్డ్ తెలిపారు. చైనాలో ఈ ఏడాది మార్చిలో ప్రయోగాత్మక టీకా ఒకదాన్ని కొంతమందిపై ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం అదే టీకాను విస్తృత స్థాయిలో ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జర్మనీలో ప్రఖ్యాత ఫార్మా కంపెనీ ఫైజర్, బయోఎన్‌టెక్ అనే సంస్థలు కలిసికట్టుగా గత వారమే 4 వేర్వేరు టీకాలను మానవులపై ప్రయోగించి పరీక్షిస్తున్నాయి. జూలైలోపు మరిన్ని ప్రయోగాత్మక టీకాలపై వివిధ దేశాలు మానవ ప్రయోగాలు నిర్వహించనున్నాయి. కరోనా వైరస్‌లోని ఓ భాగాన్ని రోగ నిరోధక వ్యవస్థ స్వయంగా గుర్తించి మట్టుబెట్టేలా చేసేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలో మరోసారి కరోనా! చైనాలో కరోనా వైరస్ మరోసారి తిరగబెడుతోందా? అవునని హెచ్చరిస్తున్నారు చైనా ఆరోగ్యశాఖ అధికారులు. దేశంలోని పది ప్రావిన్సుల్లో స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనాకేసులు కొన్ని బయటపడ్డాయని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి పెంగ్ చెప్పారు. తాజాగా వైరస్ బారిన పడ్డవారిలో లక్షణాలేవీ కనిపించడం లేదని, దీన్నిబట్టి చైనాలో కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందనే అనుకోవాలన్నారు. చైనాలో పలు కార్యాలయాలు, వ్యాపారాలు పనిచేస్తున్నప్పటికీ సినిమా థియేటర్లను మూసే ఉంచారు. ఆదివారం చైనాలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన ముగ్గురిలో కోవిడ్ లక్షణాలు కనిపించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 952 మంది కోవిడ్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. -
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్?
లండన్: వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యా న్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న 70 సంస్థలను గుర్తించగా, అందులో మూడు సంస్థలు ఇప్పటికే మనుషులపై ప్రయోగం చేశాయి. గిల్బర్ట్ ప్రయోగం తొలిదశలో 510 మంది వలంటీర్లను ఐదు గ్రూపులుగా విభజించి వారికి వ్యాక్సిన్ ఇచ్చి, వారిని ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తారు. తొలి ఇమ్యునైజేషన్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఈ ఐదు గ్రూపుల్లో ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తారు. వేసవి కాలంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే తీరునిబట్టి వ్యాక్సిన్ పనితీరుని గుర్తిస్తారు. అదే కాలంలో ఇతర దేశాల్లోని భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ ఫలితాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్లు తయారుచేస్తోన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రాథమిక నిర్ధారణలను, వారి ఆలోచనలను పంచుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు గిల్బర్ట్ లాన్సెట్ పత్రికకు చెప్పారు. -
స్టోన్‌హెంజ్‌ను నిర్మించింది వీళ్లేనట!
లండన్: బ్రిటన్‌లోని వెస్సెక్స్ ప్రాంతంలో ఉండే స్టోన్‌హెంజ్‌ను నిర్మించిందెవరో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు గుర్తించారు. భారీ బండరాళ్లతో నిర్మితమై వలయాకారంలో ఉండే స్టోన్‌హెంజ్‌ను ఎవరు ఏర్పాటు చేసి ఉంటారన్న విషయం ఇన్నాళ్లూ అంతుచిక్కకపోవడం తెలిసిందే. తాజాగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆ గుట్టు విప్పారు. పూర్వం వెస్సెక్స్, వేల్స్ తదితర ప్రాంతాల్లో నివసించిన ప్రజలే ప్రెసేలీ పర్వతాల నుంచి అంత భారీ బండరాళ్లను మోసుకొచ్చి స్టోన్‌హెంజ్‌ను నిర్మించి ఉంటారంటున్నారు. క్రీస్తు పూర్వం 3100 కాలంలో దీనిని నిర్మించి ఉంటారనీ, అప్పట్లో దీన్ని శ్మశానంగా ఉపయోగించేవారని తేల్చారు. కాగా, స్టోన్‌హెంజ్ ప్రాంతంలో 1920ల్లో వెలికి తీసిన ఎముకలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తాజాగా రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి పరిశీలించారు. 25 పుర్రెలను పరిశీలించిన శాస్త్రజ్ఞులు.. వారిలో కనీసం పది మంది చనిపోవడానికి ముందు స్టోన్‌హెంజ్ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారు కాదనీ, పశ్చిమ బ్రిటన్‌లోని వేల్స్ తదితర ప్రాంతాలకు చెందిన వారని తేల్చారు. -
రాళ్లు చేసిన మాయ.. ఆ నీరంతా ఏమైంది?
పారిస్ : అంగారక గ్రహంపై ఉన్న సరస్సులు, సముద్రాల్లోని నీరంతా ఏమైంది?. గ్రహంపై మాగ్నటిక్ ఫీల్డ్ పడిపోవడంతో శక్తిమంతమైన సోలార్ విండ్స్ అంగారకునిపై నీటిని విశ్వంలో కలిపేశాయని గతంలో పలు అధ్యాయనాలు పేర్కొన్నాయి. అయితే, తాజా పరిశోధనలు ఆ అధ్యాయనాల్లో పేర్కొన్నట్లు అంగారకుడిపై నీరు విశ్వంలో కలసి మాయం కాలేదని చెబుతున్నాయి. అంగారక గ్రహంపై నీరు మాయం కావడంపై పరిశోధకులు చెబుతున్న విషయాలను తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే. బసాల్ట్ శిలలు అంగారక గ్రహంపై నీటిని పీల్చేసుకున్నాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బసాల్ట్ శిలలకు నీటిని పీల్చుకుని తనలో ఇముడ్చుకోగల శక్తి ఉంటుంది. భూమితో పోల్చితే 25 శాతం ఎక్కువ నీటిని అంగారక గ్రహంపై గల బసాల్ట్ శిలలు గ్రహించగలవు. రసాయన చర్యలు, హైడ్రోథర్మల్ రియాక్షన్స్ ఫలితంగా భూమిపై ఉన్న రాళ్లలోని మినరల్స్‌లో మార్పులు వస్తాయని పరిశోధనలో పాలుపంచుకున్న వారిలో ఒకరైన జోన్ వేడ్ తెలిపారు. రాళ్లలోని మినరల్స్‌లో మార్పులు రావడం వల్ల అవి నీటిని గ్రహించే శక్తిని సొంతం చేసుకుంటాయని వివరించారు. అంగారక గ్రహంపై ఇలాంటి చర్యలే జరిగి నీటిని మొత్తాన్ని రాళ్లు పీల్చేసుకున్నాయని చెప్పారు. అంగారకుడిపై ఉన్న రాళ్లలోని నీరు కూడా మినరల్స్‌లో కలిసిపోయి ఉండొచ్చని అన్నారు. ఆ రాళ్లను కరిగించడం ద్వారా మాత్రమే నీటిని తిరిగి తీసుకురాగలుగుతామని చెప్పారు. భూమి పుట్టుకలో కూడా ఇలానే జరిగిందని వెల్లడించారు. అత్యంత వేడి పదార్ధాలు ఈ రాళ్ల గుండా ప్రవహించడం ద్వారానే భూమిపైకి నీరు చేరి సముద్రాలు, సరస్సులు, నదులు ఏర్పాడ్డాయని వివరించారు. -
మానవుల్లానే ఉంటాయట..!
న్యూఢిల్లీ : ఏలియన్లు ఎలా ఉంటాయి?. ఈ ప్రశ్న తట్టగానే గుర్తొచ్చేది.. హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్లుగా చూపించిన చిత్రాలు. కానీ, నిజానికి ఏలియన్లు అలా వికృత రూపాల్లో ఉండవట. ఏలియన్లకు మనిషికి దగ్గర పోలిక ఉంటుందని ఆక్స్ఫర్డ్ పరిశోధన చెబుతోంది. హాలీవుడ్ సినిమాలు, ఫిక్షన్ సాహిత్యం తదితరాలు ఏలియన్లు మనుషులను పోలి ఉండవని చెప్పడం ప్రజల్లో అది పాతుకుపోయిందని పేర్కొంది. ఏలియన్ల గురించి ఆక్స్ఫర్డ్ చేసిన ఈ శోధనకు సంబంధించిన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ప్రచురితమయ్యాయి. మనిషి రూపరేఖలు కాలగమనంలో ఎలా మారుతూ వచ్చాయో.. అచ్చం అలానే ఏలియన్లు కూడా రూపాంతరం చెందాయని పరిశోధన వెల్లడించింది. ఏలియన్ల గురించి ఊహాజనితంగా చెప్పడం కంటే ప్రాక్టికల్‌గా చెప్పడం చాలా కష్టమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అందుకే భూమి వాతావరణం నుంచే తమ వెతుకులాటను ఆరంభించామని చెప్పారు. ఇప్పటివరకూ థియరిటికల్‌గా ఉన్న అంశాల( ఏలియన్లకు డీఎన్ఏ ఉండదు, అవి నైట్రోజన్‌ను పీల్చుకుంటాయి.)ను బేస్‌గా చేసుకున్నామని తెలిపారు. ఏలియన్లు రెండు కాళ్లతోనో నడుస్తాయా?. వాటికి ఆకుపచ్చని కళ్లు ఉంటాయా? అనే ప్రశ్నలకు తమ వద్ద ఇంకా సమాధానం లేదని చెప్పారు. కానీ, మనిషిని పోలిన అంశాలు వాటిలో ఉన్నాయని కచ్చితంగా చెప్పగలమని అన్నారు. -
పావురాలకు తెలివెక్కువే..!
మందలోని ఒక గొర్రె ఎలా వెళితే అలా అన్ని గొర్రెలు గుడ్డిగా ఫాలో అయిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే పావురాలు గొర్రెల్లాగా కాదట.. తాము వెళ్లాల్సిన దారి గురించి తమ నేత తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ఊరుకోవట. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలసి చర్చించుకుని నిర్ణయించుకున్నాకే ముందుకు కదులుతాయ ని లండన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ మోడలిం గ్ ద్వారా తప్పుడు సమాచారంతో నిర్ణయాలు తీసుకునే పావురాల నేతల తప్పులు గుం పులో అట్టడుగున ఉన్న వారికీ చేరిపోతాయని అవి కూడా గొర్రెల మాదిరి గానే ఫాలో అవుతాయని అంచనాకు వచ్చారు. అయితే 5 పావురాలు ఉన్న గుంపులతో 8 సార్లు జరి పిన ప్రయోగం ఈ అంచనాను మార్చేసింది. ఈ గుంపులన్నింటినీ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడంతోపాటు ఒక్కో గుంపులో కొన్ని పావురాళ్లను క్లాక్షిఫ్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ప్రభావితం చేశారు. గుంపులో ‘పెద్ద’ పావురం క్లాక్షిఫ్టింగ్ ప్రభావానికి లోనై తప్పుడు సమాచారం అందించినా.. మిగిలినవి ఆ తప్పులను సరిచేసుకుంటాయని తెలిసింది.