ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ఏలియన్లు ఎలా ఉంటాయి?. ఈ ప్రశ్న తట్టగానే గుర్తొచ్చేది.. హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్లుగా చూపించిన చిత్రాలు. కానీ, నిజానికి ఏలియన్లు అలా వికృత రూపాల్లో ఉండవట. ఏలియన్లకు మనిషికి దగ్గర పోలిక ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ పరిశోధన చెబుతోంది. హాలీవుడ్ సినిమాలు, ఫిక్షన్ సాహిత్యం తదితరాలు ఏలియన్లు మనుషులను పోలి ఉండవని చెప్పడం ప్రజల్లో అది పాతుకుపోయిందని పేర్కొంది.
ఏలియన్ల గురించి ఆక్స్‌ఫర్డ్ చేసిన ఈ శోధనకు సంబంధించిన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ప్రచురితమయ్యాయి. మనిషి రూపరేఖలు కాలగమనంలో ఎలా మారుతూ వచ్చాయో.. అచ్చం అలానే ఏలియన్లు కూడా రూపాంతరం చెందాయని పరిశోధన వెల్లడించింది. ఏలియన్ల గురించి ఊహాజనితంగా చెప్పడం కంటే ప్రాక్టికల్‌గా చెప్పడం చాలా కష్టమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
అందుకే భూమి వాతావరణం నుంచే తమ వెతుకులాటను ఆరంభించామని చెప్పారు. ఇప్పటివరకూ థియరిటికల్‌గా ఉన్న అంశాల( ఏలియన్లకు డీఎన్‌ఏ ఉండదు, అవి నైట్రోజన్‌ను పీల్చుకుంటాయి.)ను బేస్‌గా చేసుకున్నామని తెలిపారు. ఏలియన్లు రెండు కాళ్లతోనో నడుస్తాయా?. వాటికి ఆకుపచ్చని కళ్లు ఉంటాయా? అనే ప్రశ్నలకు తమ వద్ద ఇంకా సమాధానం లేదని చెప్పారు. కానీ, మనిషిని పోలిన అంశాలు వాటిలో ఉన్నాయని కచ్చితంగా చెప్పగలమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment