పావురాలకు తెలివెక్కువే..!
మందలోని ఒక గొర్రె ఎలా వెళితే అలా అన్ని గొర్రెలు గుడ్డిగా ఫాలో అయిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే పావురాలు గొర్రెల్లాగా కాదట.. తాము వెళ్లాల్సిన దారి గురించి తమ నేత తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ఊరుకోవట. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలసి చర్చించుకుని నిర్ణయించుకున్నాకే ముందుకు కదులుతాయ ని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ మోడలిం గ్ ద్వారా తప్పుడు సమాచారంతో నిర్ణయాలు తీసుకునే పావురాల నేతల తప్పులు గుం పులో అట్టడుగున ఉన్న వారికీ చేరిపోతాయని అవి కూడా గొర్రెల మాదిరి గానే ఫాలో అవుతాయని అంచనాకు వచ్చారు.
అయితే 5 పావురాలు ఉన్న గుంపులతో 8 సార్లు జరి పిన ప్రయోగం ఈ అంచనాను మార్చేసింది. ఈ గుంపులన్నింటినీ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడంతోపాటు ఒక్కో గుంపులో కొన్ని పావురాళ్లను క్లాక్‌షిఫ్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ప్రభావితం చేశారు. గుంపులో ‘పెద్ద’ పావురం క్లాక్‌షిఫ్టింగ్ ప్రభావానికి లోనై తప్పుడు సమాచారం అందించినా.. మిగిలినవి ఆ తప్పులను సరిచేసుకుంటాయని తెలిసింది.