
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. బాబాలు, సాధువులు కూడా కుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు.
కుంభమేళాకు వచ్చిన సాధువుల్లో కొందరు ప్రత్యేక వేషధారణతో కనిపిస్తున్నారు. వీరు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ‘పావురం బాబా. ఈ యన కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గత 9 సంవత్సరాలుగా ఈయన తలపై పావురం కూర్చుంటోంది. అది ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే ఉంటోంది. దీంతో పావురం బాబాను చూసేందుకు జనం అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా జునా అఖారాకు చెందిన మహంత్ రాజ్ పురి మహారాజ్ తలపైననే ఈ పావురం ఉంటోంది.అందుకే ఈయనను ‘కబూతర్ వాలే బాబా అని పిలుస్తారు.
कबूतर वाले बाबा 🤔 pic.twitter.com/DNbVOdDotr
— Sanjai Srivastava (@SanjaiS41453342) January 11, 2025
మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ రాజ్ పురి మహారాజ్ ‘జీవులకు సేవ చేయడమే గొప్ప మతం' అని చెబుతుంటారు. ఈ బాబా నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, తినేటప్పుడు.. ఇలా అనునిత్యం ఆ పావురం బాబాను అంటిపెట్టుకునే ఉంటోంది. కబూతర్ బాబాను చూసి భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. జీవులకు సేవ చేసేవారు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారని కబూతర్ బాబా చెబుతుంటారు. @SanjaiS41453342 అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో కబూతర్ బాబా పావురంతో సమయం గడుపుతున్నట్లు చూడవచ్చు. ఆ క్లిప్‌లో ఆ పావురం బాబా తలపై కూర్చొని ఉండటాన్ని కూడా చూడవచ్చు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు