
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఫైజర్, బయోఎన్‌టెక్ ఏంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్‌టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఎంఆర్‌ఎన్‌ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్‌ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు.
చదవండి: లండన్‌లో గోమాతకు పూజలు.. రిషి సునాక్‌పై నెటిజెన్ల ప్రశంసలు..
Comments
Please login to add a commentAdd a comment