Moderna Vaccine
-
కరోనా టీకాలపై వివాదం.. కోర్టుకెక్కిన మోడెర్నా..
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైజర్, బయోఎన్‌టెక్ ఏంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్‌టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు. చదవండి: లండన్‌లో గోమాతకు పూజలు.. రిషి సునాక్‌పై నెటిజెన్ల ప్రశంసలు.. -
రెండు రోజుల్లో మోడెర్నా టీకాల రాక!
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ‘మోడెర్నా’ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి బ్యాచ్ టీకాలు మన దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మోడెర్నా టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇప్పటికే లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రారంభించిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా మోడెర్నా టీకాలు భారత్‌కు అందనున్నాయి. భారత్‌లో డీసీజీఐ నుంచి అనుమతి లభించిన నాలుగో టీకా ఇదే కావడం విశేషం. -
Corona Vaccine: ఒప్పుకోండి లేకుంటే ఇబ్బందులే!
వాక్సినేషన్ పాస్‌పోర్ట్ విషయంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సర్టిఫికేషన్‌ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. బదులుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. న్యూఢిల్లీ: ఈయూ దేశాల్లో.. అలాగే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్‌పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ల లిస్ట్‌లో భారత్‌లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండడం తెలిసిందే. ఎక్కువ మంది భారతీయలు తీసుకుంటున్న కొవిషీల్డ్‌కూ సైతం చోటు దక్కకపోవడంతో.. భారతీయ ప్రయాణికులకు ఇబ్బందికర అంశమనే ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని సీరం సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో.. కేంద్రం త్వరగతిన స్పందించింది. తక్షణమే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని, లేకుండా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పదని పేర్కొంది. ఆ ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను అనుమతించమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)ని హెచ్చరించింది కేంద్రం. ఒకవేళ అనుమతిస్తే మాత్రం.. క్వారంటైన్ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లిస్ట్‌లో మనదగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లకు మొదటి ఫేజ్‌లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం.. కనీసం కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లకైనా అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్ వ్యాక్సిన్లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు కూడా చోటు ఇవ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రతిపాదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు. ఈయూ వివరణ ఇక తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) స్పందించింది. కొవిడ్ నేపథ్యంలో ఈయూ సభ్యదేశాల మధ్య ఆటంకాల్లేని ప్రయాణం కోసం గ్రీన్‌పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం ఫైజర్/బయోఎన్‌టెక్, మెడెర్నా, వాక్స్‌జెర్విరియా, జన్‌స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే ఈఎంఏ ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి. అయితే కొవిషీల్డ్‌ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలంటూ అభ్యర్థనలేవీ రాలేదని ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ కొవీషీల్డ్ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని, అందుకు నెల టైం పట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: కొవిషీల్డ్ డోస్ గడువు మళ్లీ పెంపు.. ఈసారి ఎంతంటే.. -
గుడ్‌న్యూస్: మోడర్నాకు గ్రీన్ సిగ్నల్, 90 శాతం సమర్థత
-
గుడ్‌న్యూస్: మోడెర్నా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి పరిమితం చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ మోడెర్నా దిగుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ముంబైకి చెందిన సిప్లా సంస్థకు అనుమతి ఇచ్చింది. దీంతో, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిïÙల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్ వ్యాక్సిన్ల తర్వాత త్వరలో మోడెర్నా ప్రజలకు అందుబాటులోకి రానుంది. మోడెర్నా వ్యాక్సిన్ భారతీయ భాగస్వామి సిప్లా ఇచి్చన దరఖాస్తును పరిశీలించి అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్‌ను వాడేలా డీసీజీఐ నిర్ణయం తీసుకుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ మంగళవారం తెలిపారు. ఈ వ్యాక్సిన్ త్వరలోనే దిగుమతి అవుతుందన్నారు. దీంతోపాటు, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను కూడా దేశంలోకి ఆహా్వనించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వం తన కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కోవాక్స్ ద్వారా భారతదేశానికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించిందన్న విషయాన్ని మోడెర్నా సంస్థ జూన్ 27న డీసీజీఐకి తెలిపింది. ఈ విషయంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతి కోరింది. కాగా, సోమవారం అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ తరపున వ్యాక్సిన్ల దిగుమతి, మార్కెటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని సిప్లా సంస్థ కోరింది. అయితే మోడెర్నాకు ఇచ్చే అనుమతి అత్యవసర పరిస్థితులలో పరిమిత ఉపయోగం కోసం ఉద్దేశించిందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతానికి, యూఎస్ ఎఫ్‌డీఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ లేదా డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ డ్రగ్ రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు సీడీఎల్ వద్ద బ్యాచ్‌ల వారీ పరీక్షను మినహాయించాలని డీసీజీఐ నిర్ణయించింది. చదవండి : Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు