వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వం దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరో పదికోట్ల మోడర్నా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కోసం దాన్ని సరఫరా చేస్తోన్న ‘వార్స్ స్పీడ్స్’తో ఒప్పందం చేసుకొంది. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా ఈ డోసులను సరఫరా చేసేందుకు 2.6 బిలియన్ డాలర్లకు (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీతో ఇంతకుముందు ఓ పది కోట్ల డోస్‌ల సరఫరా కోసం ఒప్పందం చేసుకున్న విషయం తెల్సిందే.
వాస్తవానికి రెండోసారి ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని చూసింది. అందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ కూడా అవసరమైన అత్యవసర అనుమతిని కూడా మంజూరు చేసింది. చాలా దేశాలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకొన్నందున పది కోట్ల డోస్‌లను సరఫరా చేయలేమని, అందులో ఐదు కోట్ల డోసులను మాత్రమే సరఫరా చేయగలమని, కావాలంటే డిసెంబర్ నెలాఖరులోగానే సరఫరా చేస్తామని ఫైజర్ కంపెని ప్రతిపాదించింది. అందుకు ట్రంప్ అధికార యంత్రాంగం ఒప్పుకోకుండా రెండో విడత కూడా మోడర్నా వ్యాక్సిన్ కోసమే ఒప్పందం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment