వాషింగ్టన్: కోవిడ్‌కు ఫైజర్ కంపెనీ కొత్త మందును అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయిన వెంటను ఫైజర్ తయారు చేసిన పిల్ వేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయని పేర్కొంది. తాము తయారు చేసిన పిల్ తీసుకున్నవాళ్లలో 90 శాతం క్రిటికల్ పరిస్థితికి వెళ్లలేదని తెలిపింది. దీంతో కరోనా పిల్ ఆమెదం కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల సంబంధించిన నివేదికను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
చదవండి: సీఎం ట్వీట్‌పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’
అత్యవస వినియోగం కోసం పాత రిటోనావిర్ కాంబినేషన్‌తో కూడిన ఈ టాబ్లెట్‌ను అమెరికా డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌కు అక్టోబర్‌లోనే కోరినట్లు పేర్కొన్నారు. రిటోనావిర్ కాంబీనేషన్‌తో కూడిన పాక్స్లోవిడ్ కరోనా చికిత్స మాత్రను రోజుకు మూడుసార్లు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 1219 మంది కరోనా పేషంట్లపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఆస్పత్రిపాలు కావటం, మృతి చెందటం వంటివి జరగలేదని తమ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment