లండన్: కరోనా టీకా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఫైజర్, బయోఎన్‌టెక్ టీకా సరఫరా ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుందని టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సీనియర్ శాస్త్రవేత్త ఆదివారం చెప్పారు. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బయోఎన్‌టెక్ సంస్థ సీఈవో ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్ తెలిపారు. చదవండి: ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి
Comments
Please login to add a commentAdd a comment